సినిమా వార్తలు

Tharun Bhascker – Eesha Rebba: ఈషా రెబ్బాతో డైరెక్టర్ రిలేషన్… కన్ఫర్మ్ చేసిన తరుణ్ తల్లి

Published by
Srinivas

హీరోయిన్ ఈషా రెబ్బా, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మధ్య రిలేషన్షిప్ నిజమేనని గీతా భాస్కర్ మాటలతో క్లారిటీ వచ్చేసింది. త్వరలో ఇద్దరి పెళ్లి జరగొచ్చు.

హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba), డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ జంటగా కనిపిస్తున్నారు. దీపావళిని స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అంతకు ముందు చెన్నైలో కుటుంబ సభ్యులలో ఒకరు మరణిస్తే పరామర్శకు కలిసి వెళ్లి వచ్చారు. తరుణ్ – ఈషా మధ్య రిలేషన్షిప్ గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. జంటగా కనిపిస్తూ ఉండటంతో ప్రేక్షకులకూ అర్థం అవుతోంది. అయితే మేం ప్రేమలో ఉన్నామని ఎప్పుడూ డైరెక్టుగా చెప్పలేదు. కొన్ని హింట్స్ ఇచ్చారంతే. ఇప్పుడు తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ ఇద్దరి రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేశారు.

తరుణ్ భాస్కర్ సోల్ మేట్ ఈషా రెబ్బా!

ప్రొడక్షన్ డిజైనర్ లతతో తరుణ్ భాస్కర్ పెళ్లి జరిగింది. పెళ్లి చూపులు సినిమాతో పాటు అతను డైరెక్ట్ చేసిన సినిమాలకు లత వర్క్ చేశారు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చింది. వేరు పడ్డారు. డైవర్స్ కేసు కోర్టు వరకు వెళ్లింది. లతతో వేరు పడిన తర్వాత ఈషా రెబ్బాకు తరుణ్ భాస్కర్ దగ్గర అయ్యారు. కానీ రిలేషన్షిప్ గురించి అఫీషియల్ గా చెప్పలేదు.

ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ ఈఎన్ఈ రిపీట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తరుణ్ భాస్కర్- ఈషా రెబ్బా రిలేషన్షిప్ గురించి గీతా భాస్కర్ మాట్లాడారు. తరుణ్ సోల్ మేట్, ఫ్యామిలీ ఈషా రెబ్బా అని ఆవిడ క్లారిటీ ఇచ్చారు. తనకు వయసు అయిపోతుందని, తరుణ్ జీవితంలో ఒకరు ఉండాలని కోరుకుంటున్న సమయంలో ఈషా వచ్చిందని ఆమె తెలిపారు. స్నేహితులతో అన్నీ చెప్పుకోలేమని, ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక పార్టనర్ ఉండాలని, తరుణ్ భాస్కర్ పార్టనర్ ఈషా రెబ్బా అని గీతా భాస్కర్ చెప్పారు. అంతే కాదు… ఈషాకి థాంక్స్ చెప్పారు. దాంతో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బా బంధం గురించి అందరికీ క్లారిటీ వచ్చింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts

  • సినిమా వార్తలు

హీరోయిన్లతో రూమర్స్… భయపడిన నాగవంశీ?

నవంబర్ 17, 2026