Download App

‘వార్ 2’ ఫస్ట్ సింగిల్ అప్డేట్

జూలై 29, 2025 By Rahul N
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అయాన్ ముఖర్జీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ‘వార్ 2’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది. తాజాగా దర్శకుడు అయాన్ ముఖర్జీ...
‘వార్ 2’ ఫస్ట్ సింగిల్ అప్డేట్

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అయాన్ ముఖర్జీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ‘వార్ 2’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.

తాజాగా దర్శకుడు అయాన్ ముఖర్జీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆవన్ జావన్’ గురించి అప్డేట్ ఇచ్చారు. హృతిక్ రోషన్ – కియారా అద్వానీపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ ట్రాక్‌ను ప్రీతమ్ సంగీతం సమకూర్చగా, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ రాయగా, అరిజిత్ సింగ్ తన గాత్రంతో మాయ చేయబోతున్నారు.

‘బ్రహ్మాస్త్ర’లోని కేసరియాలా ఈ పాట కూడా భారీ హిట్ అవుతుందని చిత్రబృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈ వారం లోపలే ఈ పాటను విడుదల చేయనున్నట్టు సమాచారం.

భారీ యాక్షన్, ఎమోషన్‌తో రూపొందిన ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading