సినిమా వార్తలు

‘లెగసీ’ టీజర్ ఎలా ఉందంటే….?

Published by
Srinivas

టీజర్ మొదట్లోనే చెప్పారు…. పులి మీద సవారీ (స్వారీ)… నిజమే… పులిమీద సవారి చేసిన వాళ్లు దిగితే ఆ పులే మింగేస్తుంది అంటారు.

ఈ టీజర్ కూడా పులి లాంటిదే…. ప్రేక్షకుడు సంభ్రమాశ్చర్యాలకు గురి అయితే తప్ప……? తండ్రినే క్షమించలేని కొడుకు….. పవర్ గేమ్ లో కుటుంబాన్ని వాడుకునే తండ్రి…. వీళ్ల మధ్య జరిగిన కథ గా మనం భావించాలి…. ఈ టీజర్ ప్రకారం…

ఇక్కడ ఒక విషయం చెప్పాలి…. పాలిటిక్స్ లోనే కాదు…. మహాభారత కాలంలో నుండి కూడా కొడుకుల చేత మోసగించబడ్డ తండ్రులు ఉన్నారు, పుత్ర వాత్సల్యం తో తమ్ముడు బిడ్డలను కూడా మోసం చేసిన వాళ్ళను చూసాం…. తండ్రుల చేత మోసగించబడ్డ కొడుకులు శాతం చాలా చాలా తక్కువ…. బహుశా ఇది కలియుగం కాబట్టి చెప్పలేము.

ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో ఒక సందర్భంగా నాగభూషణం ఒక మాట చెబుతారు…. సొంత పెళ్ళాం లేచిపోయి మనింటికెదురుగా వేరే వాడితో కాపురం పెట్టినా పరవాలేదు తట్టుకోవచ్చు… కాని పవర్ లేకపోతే బ్రతకలేము అని…. అక్షరాలా అలాగే ఉన్నాయి నేటి రాజకీయాలు. కాని కొడుకు మీద ఇంత ఇలా రాలేదు… బహుశా విష్వక్సేనుడు చాలా ధైర్యం చేసినట్టే.

ఈ “లెగసీ” టీజర్ చాలా బాగుంది…. తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ కరెక్ట్ గా ఉండాలి…. అది చాలా చిన్నగీత….. ఏ కొడుకు కైనా తండ్రినే హీరో…. ఇది మన భారత దేశం DNA లో అలా నిక్షిప్తమై ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి కథ కానీ… ఆ ఇద్దరి పాత్రల మధ్య రసవత్తరం గా ఉండాలి… లేకపోతే ఆ హీరో తండ్రి సమాధి పైన చేసిన కార్యక్రమం…. బ్యాక్ ఫైర్ అవుతుంది.

సత్యం రామలింగరాజు కథ ఆధారంగా Netflix లో “బ్యాడ్ బాయ్ బిలియనీర్” వస్తుంది. కోర్టు ఆదేశాలు తో…..ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఆ కుంభకోణం వెలుగు చూసిన తరువాత లో రామలింగరాజు ఒక మాట అన్నారు….నేను చేసిన పని “పులి మీద స్వారీ చేయడం లాంటిది, అది మనల్ని తినకుండా ఎలా సురక్షితంగా దిగిపోవాలో నాకు తెలియ లేదు” అని…

ఇదీ చదవండి:
Funky Teaser: ఫంకీ టీజర్

అలాగే ఈ టీజర్ లో కూడా నిర్మాత, దర్శకుడు, హీరో పులిమీద సవారి చేస్తున్నారు అని సినీ పండితుల ఉవాచ.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.