కూలి

Published by
Srinivas

కూలి రివ్యూ: స్టైల్ ఎక్కువ ఉందమ్మా… ట్విస్టులు సూపర్

కమల్ హాసన్ కెరీర్ కంప్లీట్ అయింది అనుకున్న టైంలో విక్రమ్ సినిమా వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది దాంతో ఒక్కసారిగా కమల్ మళ్లీ స్టార్ హీరోల రేసులోకి వచ్చాడు. ఆ సినిమా తీసిన దర్శకుడు లోకేష్ కనకరాజ్. దళపతి విజయ్ హీరోగా మాస్టర్ లియో సినిమాలు తీసింది కూడా అతనే. సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా అంటే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి కలిగింది. అక్కినేని నాగార్జున విలన్ రోల్ చేయడం, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ వంటివి సినిమాపై అంచనాలు పెంచాయి. అందుకు తగ్గట్టుగా సినిమా ఉందా? లేదా?

కథ:

దేవా (రజినీకాంత్)కు ఒక హాస్టల్ ఉంటుంది. దాని పేరు మ్యాన్షన్. అక్కడ స్టూడెంట్స్ కు చాలా తక్కువ ఫీజుకు వసతి ఇస్తారు. అయితే మందు దమ్ము వంటివి కొట్టకూడదని కండిషన్ పెడతారు. ఒకరోజు దేవాకు తన స్నేహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) మరణించాడని తెలుస్తుంది.

రాజశేఖర్‌ది సహజ మరణం కాదని, ఎవరో గుండెలపై బలంగా కొట్టడంతో మరణించారని తెలుస్తుంది. తన స్నేహితుడి మరణానికి కారణమైన వాళ్లను తెలుసుకోవాలని దేవా చెబితే… రాజశేఖర్ పెద్ద కుమార్తె ప్రీతి (శృతిహాసన్) వద్దని అంటుంది. తమను వదిలేయమని చెబుతుంది. అదే సమయంలో వాళ్ళకు సైమన్ (నాగార్జున) రైట్ హ్యాండ్ దయాల్ (సౌబిన్ షాహిర్) నుంచి పిలుపు వస్తుంది. రాజశేఖర్ అక్కడే పని చేసేవాళ్ళు.

రాజశేఖర్ చేసే పని ఏమిటి? స్నేహితుడి మరణానికి కారణమైన వాళ్లను తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో దేవా ఏం తెలుసుకున్నాడు? సైమన్ ఏం చేస్తాడు? దేవా గతం ఏమిటి? అనేది సినిమా.

విశ్లేషణ:

సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఆయన ఫ్యాన్స్ మంచి కిక్ ఇచ్చే ఇంట్రడక్షన్, విలన్లకు ఇచ్చే వార్నింగుల్లో పంచ్ డైలాగ్స్ వంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. అటువంటిది ఏవీ లేకుండా మంచి పాటతో రజినీని పరిచయం చేశాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఆ సాంగ్ ఫ్యాన్స్ అందరికీ ఒక విజువల్ ఫీస్ట్ కింద ఉంటుంది. కథలో ఒక్కొక్క లేయర్ రివీల్ చేసిన విధానం కూడా బాగుంది. ఫస్ట్ సాంగ్ నుంచి ఎండింగ్ వరకు అనిరుద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.

రజనీకాంత్ నుంచి ఆడియన్స్ ఆశించే భారీ యాక్షన్ సీన్లు కూడా బాగా తీశారు. ఆ సన్నివేశాలకు అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ చేసింది. ఇంటర్వెల్ ముందు లోకేష్ కనకరాజు ఇచ్చిన ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్. అయితే ఇంటర్వెల్ తర్వాత ఆశించిన స్పీడులో సినిమా సాగలేదు. యాక్షన్ సీన్లు బాగున్నా కథ పరంగా సాగదీశారు. అయితే ఉపేంద్ర, రచితా రామ్, ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ తో పాటు వాళ్లకు ఇచ్చిన ట్విస్టులు సూపర్ ఉన్నాయి. అయితే క్లైమాక్స్ విషయంలో హడావిడిగా ముగించినట్టు ఉంటుంది. సినిమాలో కీలకమైన రెండు క్యారెక్టర్ల మధ్య రిలేషన్ రివిల్ అయినప్పుడు రావాల్సిన ఎమోషనల్ హై రాలేదు.

రజనీకాంత్ వయసు 75 ఏళ్ల అంటే నమ్మలేము. సినిమాలో చాలా హుషారుగా డాన్సులు, ఫైట్లు చేశారు. కొన్ని సన్నివేశాలలో ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు సూపర్. తెలుగు ప్రేక్షకులకు నాగార్జునను విలన్ పాత్రలో చూడడం కొత్తగా ఉంటుంది. శృతిహాసన్ డి గ్లామర్ రోల్ చేశారు. నటిగా కొత్తదనం చూపించారు. సౌబిన్ షాహిర్ విలన్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. మిగతా క్యారెక్టర్లలో సత్యరాజ్, రచితా రామ్ బాగా చేశారు. ఆర్టిస్టులు క్యారెక్టర్లకు న్యాయం చేశారు.

తీర్పు:

సూపర్ స్టార్ సినిమా అంటే స్టైల్. కూలీలో అది బావుంది. కింగ్ నాగార్జున స్టైల్ కూడా సూపర్ అనేలా ఉంది. ఇంటర్వెల్ ముందు వరకు సినిమా స్పీడుగా సాగింది. ఆ తర్వాత కొంచెం సాగినట్లు అనిపించిన రజనీకాంత్ స్టైల్, నాగార్జున విలనిజం, అతిధి పాత్రల్లో స్టార్స్ సందడి ఆకట్టుకుంటుంది. మంచి కమర్షియల్ ఎక్స్పీరియన్స్ కోసం వీకెండ్ వాచ్ చేయొచ్చు.

Read Coolie Review in English

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

హనుమాన్ అంశ్

అక్టోబర్ 9, 2026

కామ్రేడ్‌ కళ్యాణ్

అక్టోబర్ 9, 2026

సిగ్మా

అక్టోబర్ 2, 2026

తెల్ల కాగితం

అక్టోబర్ 2, 2026

డోరతీ

అక్టోబర్ 2, 2026