వార్ 2 రివ్యూ: హృతిక్ ముందు ఎన్టీఆర్ నిలబడ్డాడా?
వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ డబల్ కాలర్ ఎత్తారు. ఆయన సింగిల్ కాలర్ ఎట్టయితే సినిమా సూపర్ హిట్. డబుల్ కాలర్ అంటే బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. రిజల్ట్ బ్లాక్ బస్టరా? లేదా తేడా కొట్టిందా? రివ్యూలో తెలుసుకోండి.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించడం వల్ల బాలీవుడ్ సినిమా వార్ 2కు తెలుగులో భారీ రిలీజ్ దక్కింది. ఆడియన్స్ కన్ను సినిమాపై పడింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో హృతిక్ రోషన్ హిట్ సినిమా వార్ సీక్వెల్ కావడంతో బాలీవుడ్ ఆడియన్స్ చూపు కూడా పడింది. కియారా అద్వానీ గ్లామర్ షో యూత్‌ను అట్రాక్ట్ చేసింది. సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమైన రా ఏజెంట్, గూఢచారిగా దేశభద్రతలో ఒకప్పుడు కీలకంగా పనిచేసిన కబీర్ (హృతిక్ రోషన్) కొన్ని కారణాల వల్ల దేశ వ్యతిరేకిగా మారతాడు. ఒకప్పుడు తండ్రిలా భావించిన రా చీఫ్ లూత్రా (అసుతోష్ రానా)ను చంపేస్తాడు.
లూత్రా మరణానికి కారణమైన కబీర్‌ను పట్టుకోవాలని కొత్తగా ‘రా’లోకి చేరిన విక్రమ్ చలపతి (ఎన్టీఆర్), లూత్రా కుమార్తె – ‘రా’లో మరో ఏజెంట్ కావ్య (కియారా అద్వానీ) ప్రయత్నిస్తారు. కబీర్ వర్సెస్ విక్రమ్ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు? కబీర్ – కావ్య మధ్య గతంలో ఏం జరిగింది? రా కొత్త చీఫ్ కౌల్ (అనిల్ కపూర్) ఏం చేశారు? కబీర్ దేశ వ్యతిరేకిగా మారడానికి కారణం ఎవరు? అనేది సినిమా.
విశ్లేషణ:
వార్ 2లో ఇంటర్వెల్ ముందు వరకు కథ పెద్దగా జరగలేదు. కానీ హీరోల ఇంట్రడక్షన్ యాక్షన్ సీన్లు బాగా తీశారు. స్టోరీ పరంగా ఎగ్జైట్ చేయకుండా స్టైల్ పరంగా ఎంటర్టైన్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలలో ఉండే కథకు భిన్నమైన కథ చూపించారు. అయితే కథను ముందుకు తీసుకు వెళ్లిన వీరు చాలా నిదానంగా నిస్సారంగా సాగింది.
స్పై జోనర్‌లో ఇలాంటి కథతో సినిమా తీయాలనుకోవడం సాహసం. క్యారెక్టర్స్ బ్యాడ్ డ్రాప్ ఏదైనా కావచ్చు కానీ కథలో దేశం అందరి కంటే ముందు ఉండాలి. ఇండియా ఫస్ట్ అని వార్ 2లో హృతిక్ డైలాగ్ చెప్తారు. కానీ కథలో ఎక్కడ ఇండియా ఫస్ట్ అన్నట్టు ఉండదు. ఇద్దరు హీరోల మధ్య వార్ మెయిన్ పాయింట్ తీసుకుంది దాంతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ బ్యాక్ సీట్ కి వెళ్ళింది.
స్టైలిష్ ఫైట్స్ మధ్యలో వచ్చే పూర్ విజువల్ ఎఫెక్ట్స్ డిస్టర్బ్ చేశాయి. మరి నాసిరకం సీస వర్క్ స్క్రీన్ మీద బాలేదు. అలాగే పాటలు కూడా బాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆశించినట్టు లేవు. కథలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి బాగుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు ఆసక్తి కలిగించలేదు. దర్శకుడు అయాన్ ముఖర్జీకి యాక్షన్ సినిమాలు డీల్ చేసిన అనుభవం లేకపోవడం సినిమా మీద ఎఫెక్ట్స్ చూపించింది. కథను నిదానంగా చెబుతూ వెళ్లారు ఇంకొంచెం స్పీడ్ గా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వార్ 2 సినిమాకు బిగ్గెస్ట్ పిల్లర్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్. సినిమా అంతటని తమ భుజాల మీద మోశారు. వాళ్ళిద్దరు క్యారెక్టర్లు డిజైన్ చేసిన విధానం బాగుంది. ఒకరు హీరో మరొకరు విలన్ అన్నట్టు కాకుండా ఇద్దరినీ హీరోలుగా చూపించారు ఇద్దరినీ విలన్లుగా చిత్రీకరించారు. సన్నివేశాలకు తగ్గట్టు అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్ కంటే హృతిక్ స్క్రీన్ స్పేస్ ఎక్కువ. అయితే హృతిక్ చేత ఎన్టీఆర్ ఎలివేషన్ డైలాగ్స్ చెప్పించారు. గ్లామర్ కోసం కథలో కీలకమైన ఒక మలుపు కోసం తప్పిస్తే కియారా అద్వానీ పాత్రకు ప్రాముఖ్యం లేదు. అనిల్ కపూర్, అసుతోష్ రానా సైతం కథలో పాత్రలకు తగ్గట్టు చేశారు.
తీర్పు:
హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అభిమానులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే… వాళ్ళిద్దరి ఇంట్రడక్షన్స్, ఇద్దరి మధ్య వచ్చే పోటాపోటీ యాక్షన్ సీన్స్ మెప్పిస్తాయి. రెగ్యులర్ ఫార్మాట్లో తీసిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇది. అంతకుమించి ఎక్కువ ఆశించవద్దు