లెనిన్

Published by
Srinivas

అక్కినేని అఖిల్.. ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో కుమారుడూ ఫేస్ చేయనంత స్ట్రగుల్‌ను సక్సెస్ కోసం ఫేస్ చేస్తున్నాడు. చివరకు అఖిల్ సోదరుడు నాగ చైతన్య సైతం ఒకట్రెండు సినిమాలతోనే సక్సెస్ అయ్యాడు. దాదాపుగా సినిమాలో స్టార్ హీరోలందరి కుమారులు.. ఒకట్రెండు సినిమాలతోనే సక్సెస్ కొట్టి.. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కానీ అఖిల్ ఒక మంచి సక్సెస్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు. దీంతో కొంత విరామం తీసుకుని ఇప్పటివరకూ చేయని విభిన్నమైన కథతో.. పవర్‌ఫుల్ టైటిల్‌ ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ సైతం బీభత్సంగా నిర్వహించారు. మరి అఖిల్ సక్సెస్ అందుకున్నట్టేనా? చూద్దాం.

క‌థేంటంటే..

లెనిన్ (అఖిల్‌) ఓ అనాథ. చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరులో ఉత్సవాలు జరుగుతుండగా ఆకలితో అక్కడకు వెళతాడు. శ్రీ రామాపురానికి మరో గ్రామానికి ఆలయంపై జెండా పాతే విషయంలో ఘర్షణ జరుగుతుంటుంది. అది పూర్తైతే కానీ అన్నదానం నిర్వహించలేమని గుడి పూజారి చెప్పడంతో లెనిన్ ఆలయ శిఖరంపై జెండా పాతుతాడు. అప్పుడే ఆ గ్రామంలోని ఓ పెద్దింటి మ‌హిళ (ఈశ్వ‌రీరావు) లెనిన్‌ను చూసి వివరాలడిగి అతడిని చేరదీస్తుంది. ఆమె కొడుకు వ‌సంత్ (ప్ర‌మోద్ పంజు) కూడా లెనిన్‌‌తో బాగా కలిసిపోతాడు. ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. వ‌సంత్ చదువుల కోసం ప‌ట్నం వెళ్ల‌గా, లెనిన్ మాత్రం ఊళ్లోనే ఉంటూ ఆ కుటుంబానికి సర్వం తానే అన్నట్టుగా మారిపోతాడు. ఊళ్లో 18 రోజులపాటు ఎంతో ప‌విత్రంగా జ‌రిగే భార‌తం మెట్ట ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ని సైతం లెనిన్ త‌న భుజాల‌పై వేసుకుంటాడు. ఆ ఉత్సవాల్లోనే భార‌తి (భాగ్య‌శ్రీ బోర్సే)ని కలవడం.. వారిద్దరి మధ్య ప్రేమ వంటివి నడుస్తాయి. డాక్టర్‌గా ఊరికొచ్చిన వ‌సంత్‌ స్వ‌యంగా లెనిన్‌, భార‌తి వివాహాన్ని జ‌రిపిస్తాడు. ఆ ఊళ్లో ఉత్స‌వాల ఆఖ‌రి రోజు అనూహ్యంగా ఓ సంఘ‌ట‌న జ‌రుగుతుంది. ఆ ఘటన కథను ఎలాంటి మలుపు తిప్పుతుంది? అసలు లెనిన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందకు వచ్చింది? వసంత్ పాత్ర ఏమిటి? భారతి ఏమవుతుంది? వంటి అంశాలను వెండితెరపై వీక్షించాల్సిందే.

ఎలా ఉందంటే..

శ్రీరామ‌పురం అనే గ్రామంలో జ‌రిగే కథను మహాభారతంతో ముడిపెట్టాడు దర్శకుడు. మహాభారతంలో అర్జనుడు తన వారితోనే యుద్ధం చేసేందుకు సంశయించగా.. శ్రీకృష్ణుడు అతడిని గీతను బోధిస్తాడు. ఈ చిత్రంలో లెనిన్ తనను తానే అర్జనుడిలా మలుచుకుని యుద్ధం చేస్తాడు. రంగులు మార్చే పాత్ర‌లు, కురుక్షేత్రాన్ని త‌ల‌పించే పోరాటం సినిమాలో జరుగుతుంది. ఈ సినిమా ఒక గ్రామీణ యాక్షన్ డ్రామా. ఫస్ట్ హాఫ్ అంతా లెనిన్ శ్రీరామాపురంకు రావడం.. చిత్తూరు జిల్లాలో నిజంగానే జ‌రిగే భార‌తం మెట్ట జాత‌ర నేప‌థ్యంతో కొనసాగుతుంది. సెకండాఫ్‌లో లెనిన్ జైలు నుంచి విడుదలవడం.. స్కెచ్ వేసి మరీ తన ప్రత్యర్థులందరినీ ఒక చోట చేర్చడం ఆ తరువాత పరిణామాలతో కొనసాగుతుంది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లోనే సినిమా సాగిపోతుంది. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీత అనిపించినా కూడా.. ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది. సెకండాఫ్ వచ్చే వరకూ దర్శకుడు కొంత తడబడ్డాడేమో అనిపిస్తుంది. పాత్రల అసలు స్వరూపమంతా సెకండాఫ్‌లోనే దర్శకుడు బయటపెట్టాడు. అయితే ట్విస్ట్‌లన్నీ మన ఊహలకు అనుగుణంగానే ఉంటాయి. ఎక్కువ శాతం యాక్షన్ సన్నివేశాలతోనే నడిపించాడు.

ఎవ‌రెలా చేశారంటే..

అక్కినేని అఖిల్ తన పాత్రలో చాలా బాగా లీనమయ్యాడు. లెనిన్ పాత్ర‌లో ప్రేమ, కోపం, రివెంజ్ వంటివన్నీ ఉంటాయి. అన్నింటినీ అద్భుతంగా చూపించాడు. హీరోయిన్ భాగ్య‌శ్రీ బోర్సే కూడా భార‌తి పాత్ర‌లో జీవించింది. అయితే ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు కొంత మైనస్ అనిపించింది. కానీ వెండితెరపై చాలా అందంగా కనిపించి మెప్పించింది. శివాజీ ఎప్పటిలాగే తన పాత్రలో జీవించారు. ప్ర‌మోద్ పంజు న‌ట‌న అయితే సినిమాకి హైలైట్. విలన్‌గా అతనొక మంచి ఛాయిస్ అని చెప్ాపలి. ఈశ్వరీరావు, బ్ర‌హ్మాజీ, రాంకీ, సునీల్‌, గెట‌ప్ శ్రీను, శ‌త్రు త‌దిత‌ర న‌టులు అంతా తమ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

టెక్నికల్ పరంగా..

టెక్నికల్ పరంగా సినిమా చాలా బాగుంది. దర్శకుడు మురళీ కిషోర్‌ అబ్బూరి స్క్రిప్ట్‌పై మరికొంత పట్టు బిగించాల్సింది. ముఖ్యంగా భావోద్వేగ కోణంపై పెద్దగా ఫోకస్ చేయలేకపోయారు. ట్విస్ట్‌లు సైతం ఊహకు భిన్నంగా ఏమీ సాగవు. ముఖ్యంగా లియోన్ బ్రిట్టో కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. త‌మ‌న్ సంగీతం కూడా బాగుంది. బీజీఎం సినిమాను ఒక మెట్టు ఎక్కించింది. ఎడిటింగ్‌ విషయంలో కాస్త శ్రద్ధ వహించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.

ఫైనల్‌గా.. అఖిల్ గత సినిమాలతో పోలిస్తే ‘లెనిన్’ బాగుందనే చెప్పాలి

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

సిగ్మా

అక్టోబర్ 2, 2026

తెల్ల కాగితం

అక్టోబర్ 2, 2026

డోరతీ

అక్టోబర్ 2, 2026

అనుమాన పక్షి

సెప్టెంబర్ 25, 2026

ది ప్యారడైజ్

సెప్టెంబర్ 24, 2026