Download App

అఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ మైలురాయి.. ‘లెనిన్’ మరో ఘనత!

జూలై 31, 2026 • By Srinivas
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే రికార్డుల వేట ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను...
‘లెనిన్’ నుంచి విడుదలైన ‘వారెవా వారెవా’ లిరికల్ సాంగ్‌

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే రికార్డుల వేట ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పుడు అధికారికంగా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ మైలురాయిని అభిమానులతో పంచుకుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అఖిల్ అక్కినేనికి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించగా, జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన భారీ స్పందనతో ప్రతి రోజు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువత కూడా సినిమాను ఆదరించడంతో ‘లెనిన్’ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ఇప్పుడు రూ.100 కోట్ల మార్క్‌ను దాటడంతో అఖిల్ కెరీర్‌లో ఇదే తొలి రూ.100 కోట్ల చిత్రం కావడం విశేషం.

Lenin Telugu Movie Review

‘లెనిన్’ విజయానికి దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు అందించిన బలమైన కథ, భావోద్వేగాలతో కూడిన కథనం ప్రధాన కారణంగా నిలిచాయి. టైటిల్ పాత్రలో అఖిల్ అక్కినేని తన కెరీర్‌లోనే అత్యంత మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని ప్రేక్షకులు ప్రశంసించారు. భాగ్యశ్రీ బోర్సే తన నటనతో ఆకట్టుకోగా, శివాజీ, ఈశ్వరీ రావు, ప్రమోద్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికంగా కూడా సినిమా ఉన్నత స్థాయిలో నిలిచింది. ఎస్. తమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాను మరింత ప్రభావవంతంగా నిలబెట్టాయి.

రూ.100 కోట్ల క్లబ్‌లో ‘లెనిన్’ చేరడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయంతో అఖిల్ కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్టేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading