రణబాలి

Published by
Srinivas

విజయ్ దేవరకొండ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆచితూచి ఓ ఇంట్రస్టింగ్‌.. రియల్ స్టోరీని ఎంచుకుని ‘రణబాలి’ అనే చిత్రంతో రంగంలోకి దిగాడు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఆయన సతీమణి రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించడం విశేషం. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే…

1854 నుంచి 1878 మధ్యలో జరిగే కథ ఇది. సింగనమలలో ఓ పాలెగాడి కుటుంబంలో సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) జన్మిస్తాడు. కానీ పుట్టగానే ఎలాంటి చలనం ఉండదు. దీంతో ఆ ఊరి భద్ర మల్లన్నకు రణబాలి తల్లి రాజమ్మ (ఈశ్వరీ రావు) మొక్కుకుంటుంది. ఈ క్రమంలోనే భద్ర మల్లన్న తాత.. రణబాలిని బతికించి రెండు పుష్కరాలు మాత్రమే జీవిస్తాడని చెబుతాడు. రణబాలి పెరిగిన తరువాత తన ప్రజలందరికీ అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు ఎప్పుడూ తాగుతూ కాలం గడిపేస్తూ ఉంటాడు. రణబాలికి రాజమ్మ.. జయమ్మ(రష్మిక)తో పెళ్లి చేస్తుంది. ఆ తరువాత జయమ్మ అతన్ని మార్చుకుంటుంది. మరోవైపు కరువు కారణంగా తమ చుట్టుపక్కల ప్రాంతమంతా ఎంత ఇబ్బంది పడుతుందో రణబాలి తెలుసుకుంటాడు. ఆ తర్వాత రణబాలి ఆ ప్రాంతానికి ఎలా న్యాయం చేశాడు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పట్టి పీడిస్తున్న కరువు రాక్షసుడిని రణబాలి ఎలా హతమార్చాడు? చివరికి రణబాలి, జయమ్మ జీవితాలు ఏమయ్యాయి? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే…

కరువు పీడిత ప్రాంతంలో ఉన్న ఒక పాలెగాడు తమ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న బ్రిటిష్ అధికారులను ఎదిరించి, తనను నమ్ముకున్న ప్రజలకు, తనను నమ్మి వచ్చిన ప్రజలకు ఎలా కష్టాన్ని తొలగించాడనేదే కథ. చరిత్రలో కనుమరుగైన వీరులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరిని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే ఇది. సినిమా వాస్తవ కథ ఆధారంగా రూపొందినప్పుడు ఇష్టానుసారంగా సినిమాటిక్ లిబర్టీ తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా కూడా అది మెయిన్ కంటెంట్‌ను దెబ్బ తీయకుండా జాగ్రత్త పడాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగా సినిమాను దర్శకుడు తీసుకెళ్లాడు. కానీ సెకండాఫ్ విషయానికి వస్తే సాగదీత, సినిమాటిక్ లిబర్టీ ఎక్కువయ్యాయనిపిస్తోంది. అలాగే వైలెన్స్ కూడా చాలా ఎక్కువైంది. ఒక వీరుడి కథను ఇంకా ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా మలిచే అవకాశం ఉంది. కానీ ఎందుకో దర్శకుడు ఆ విషయంలో కాస్త తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్‌ను తీసుకెళ్లినంత ఆసక్తికరంగా.. సెకండాఫ్‌ను తీసుకెళితే బాగుండేది. వైలెన్స్ చాలా ఎక్కువవడంతో అందరూ చూడటం కష్టమే. నిడివి కూడా అంత అవసరం లేదేమో అనిపించింది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది.

ఎవరెలా నటించారంటే..

విజయ్ దేవరకొండ.. రణబాలి అనే పాత్రలో జీవించాడు. యాస విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఇక రష్మిక కూడా జయమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా కూడా ఆకట్టుకుంటుంది. ‘ది మమ్మీ’ నటుడు విలన్‌గా కనిపించి మెప్పించాడు. అతని పర్సనాలిటీ విలన్‌గా బాగా సెట్ అయ్యాడు. ఈశ్వరీరావు తల్లి పాత్రలో చాలా బాగా నటించారు. మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ పరంగా…

ఇప్పటికే సినిమాకు సంబంధించి ఓ సాంగ్ నెట్టింట బాగా వైరల్ అయిపోయింది. మిగిలిన పాటలు పర్వాలేదనిపించాయి. బీజీఎం కూడా సినిమాకు తగ్గట్టు ఉంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నాటి కాలాన్ని కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.

ఫైనల్‌గా.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడినట్టే..

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

కల్ట్

అక్టోబర్ 30, 2026

కిల్లర్

అక్టోబర్ 30, 2026

నా వైఫ్ మిస్సింగ్

అక్టోబర్ 25, 2026

418

అక్టోబర్ 23, 2026

హైకూ

అక్టోబర్ 23, 2026