టాక్సిక్

Published by
Srinivas

‘కేజీఎఫ్’ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ రేంజే మారిపోయింది. ఆయన చిత్రం వస్తోందంటేనే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం ఆయన యాక్షన్, బోల్డ్ జానర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్‌లో బ్లడ్ బాత్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి అయినా కూడా నయనతార వంట ప్రముఖ తారాగణం కనిపించి సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన టాక్సిక్ ఎలా ఉందో తెలుసుకుందాం.

కథేంటంటే..

గంగ (నయనతార) తన తమ్ముడు రాయా (యష్‌)ను ఎలాంటి ఇబ్బంది లేకుండా పెంచేందుకు ఏం చేసేందుకైనా వెనుకాడదు. అలా ఇద్దరూ పెరిగి పెద్దవుతారు. మరోవైపు ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినా.. గోవా మాత్రం పోర్చుగీసు వారి ఆధీనంలోనే ఉంటుంది. అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు కొదువ ఉండదు. డ్రగ్స్‌, మాఫియా అన్నీ అక్కడ యథేచ్చగా కొనసాగుతుంటాయి. ఆ చీకటి రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని గ్రూప్ వార్స్ నడుస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రపంచంలో రాయ ఎంటరై తనకు తిరుగు లేకుండా చేసుకుంటాడు. వెన్నుపోట్లు, ఆధిపత్య పోరు ఉన్న ఇలాంటి ప్రపంచంలో రాయ(యష్‌) స్వతంత్రంగా ఎదుగుతాడు. ఆ తరువాత రెబెకా (తారా సుతారియా)ను పెళ్లి చేసుకుని తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలనుకుంటాడు. ఇంతలోనే అతనికి నాడియా (కియారా) తారసపడుతుంది. ఆమెతో ప్రేమాయణం సాగిస్తాడు. ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ సమయంలోనే అనుకోని ఘటన జరుగుతుంది. అది రాయా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ తరువాత రాయా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఎలిజబెత్ (హ్యుమా ఖురేషి), మెలిసా (రుక్మిణి వసంత్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

సాధారణ ప్రేక్షకులకు ఏమాత్రం అర్ధమయ్యే సినిమా కాదిది. అసలెందుకు ఫైట్స్ జరుగుతున్నాయి? ఎందుకింత రక్తపాతం అనేది ఏమాత్రం అర్థం కాదు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కథను ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్పడంలో టోటల్‌గా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా కథను యాక్షన్, రొమాన్స్ రెండూ డామినేట్ చేశాయి. బోల్డ్ సీన్స్, రక్తపాతం తప్ప సినిమాలో ఏమీ లేదన్నట్టుగా చేశాయి. ఫస్ట్ హాఫ్ అంతా కొన్ని పాత్రల పరిచయం, మాస్ ఎలిమెంట్స్, గ్యాంగ్‌స్టర్ ప్రపంచంతో నడిపించారు. చాలా స్లో నెరేషన్ విసుగెత్తిస్తుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. యాక్షన్ మరింత భారీగా, తీవ్ర రూపం దాల్చుతుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా మాదిరిగానే అనిపించినా కూడా బలమైన మోటివ్ అనేది కనిపించదు. అసలు రాయాను చంపడానికి వచ్చే వారెవరనేది కూడా అర్థం కాదు. అక్కాతమ్ముళ్ల మధ్య బంధాన్ని బాగానే చూపించినప్పటికీ అత్యంత ఎమోషన్ ఉన్న సన్నివేశంలోనూ దానిని ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. మొత్తంగా టాక్సిక్ పేరుకు తగ్గట్టే ఉంది.

ఎవరెలా నటించారంటే..

ఈ సినిమా మొత్తమ్మీద రెండు పాత్రలే కీలకమని చెప్పాలి. యష్.. తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో మెప్పించాడు. రెండు పాత్రల నడుమ వేరియేషన్ అద్భుతంగా చూపించాడు. లుక్ పరంగా కూడా చాలా తేడా కనిపిస్తుంది. అసలు కొడుకు టికెట్ పాత్రలో చేసింది యషేనా అనే సందేహం కలుగుతుంది. అంతలా తన పాత్రలో యష్ మెల్ట్ అయ్యాడు. ఈ చిత్రంలో యష్‌ను పక్కనబెడితే నయనతార, అంతో ఇంతో కియారా అద్వానీకి మంచి పాత్రలు దక్కాయి. మిగిలిన వారంతా పాసింగ్ క్లౌడ్స్ గానే అనిపించారు. గంగా పాత్రలో నయనతార చాలా బాగా నటించింది. కానీ లుక్స్ పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కియారా అద్వానీ చాలా అందంగా కనిపించడమే కాకుండా తన పాత్రకు న్యాయం చేసింది. హుమా ఖురేషి పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర అయినా కూడా ఎలిజబెత్‌గా బాగానే నటించింది. రుక్మిణి వసంత్ మెలిస్సాగా సర్‌ప్రైజ్ చేసింది. ఆమె నటన పర్వాలేదనిపించింది. తారా సుతారియా రెబెక్కా, అక్షయ్ ఒబెరాయ్ టోనీ, డారెల్ డిసిల్వా సాల్వడార్, సుదేవ్ నాయర్ కర్మాడి తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

సినిమా వేరే భాషల వారికైతే ఏమో కానీ తెలుగు ప్రేక్షకులకు ఎక్కడం చాలా కష్టం. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కాస్త తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుండేది. ఈ సినిమా అర్థం కావాలంటే చాలా కష్టం. డబ్బింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎడిటింగ్ అత్యంత పేలవం. మూడు గంటల పరీక్ష. సంగీతం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బీజీఎం వరకూ పర్వాలేదనిపించింది. యాక్షన్ సన్నివేశాల్లో బ్లడ్ వరదలై పారింది. ప్రతి యాక్షన్ సన్నివేశం కూడా సాధారణంగా ఏమీ లేదు. ఇక నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి.

ఫైనల్‌గా.. ఇట్స్ వెరీ వెరీ టాక్సిక్

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Share
Published by
Srinivas

Recent Posts

సిగ్మా

అక్టోబర్ 2, 2026

తెల్ల కాగితం

అక్టోబర్ 2, 2026

డోరతీ

అక్టోబర్ 2, 2026

అనుమాన పక్షి

సెప్టెంబర్ 25, 2026

ది ప్యారడైజ్

సెప్టెంబర్ 24, 2026