Download App

కార్పొరేట్ ముసుగులో జీహాదీ కుట్ర….. TCS ఘటన పై విశ్లేషణ…

ఏప్రిల్ 15, 2026 By Suresh Thota
జాతి పిత "గాంధీజీ" మాట : “The day a woman can walk freely on the roads at night, that day we can say that India has achieved independence.” "ఒక స్త్రీ అర్ధరాత్రి రోడ్లపై స్వేచ్ఛగా నడవగలిగిన రోజున, ఆ...

జాతి పిత “గాంధీజీ” మాట :

“The day a woman can walk freely on the roads at night, that day we can say that India has achieved independence.”

“ఒక స్త్రీ అర్ధరాత్రి రోడ్లపై స్వేచ్ఛగా నడవగలిగిన రోజున, ఆ రోజు భారతదేశం నిజమైన స్వాతంత్ర్యం సాధించిందని చెప్పవచ్చు”.

కర్ణాటక హైకోర్టు కూడా ఇటీవల ఒక తీర్పులో ఈ మాటను ఉటంకించింది. ఒరిస్సా హైకోర్టు కూడా “మహిళలు అర్ధరాత్రి భారతదేశ వీధుల్లో సురక్షితంగా నడవగలగడం” అనేది గాంధీజీ కల అని పేర్కొంది. “గాంధీజీ” దృష్టిలో కేవలం రాజకీయ స్వాతంత్ర్యం సరిపోదు. సమాజంలో మహిళలకు పూర్తి భద్రత, స్వేచ్ఛ ఉన్నప్పుడే అసలైన స్వరాజ్యం వచ్చినట్లు. అని చెప్పారు.

కాని దేశ పరిస్థితిలు చూస్తుంటే అర్ధరాత్రి మాట దేవుడెరుగు…. జీవనోపాధికై మహిళలు ఉద్యోగాలు కి వెళుతుంటే “మేకవన్నె పులులు” పట్టపగలు ఆడుకుంటున్నాయి.

మహిళల కోసం మహిళా బిల్లు అధికారిక పేరు “నారీ శక్తి వందన్ అధినియమ్” (Nari Shakti Vandan Adhiniyam). “మహిళా రిజర్వేషన్ బిల్లు” అని ప్రపంచానికి, మనం దేశం చాటి చెబుతున్న వేళ…. దేశం మొత్తం తల దించుకునేలా నాసిక్ లో…… దేశం లోనే ప్రతిష్టాత్మకమైన కంపెనీ TCS లో మహిళ ల జీవితాలతో ఆడుకున్న కొంతమంది అభినవ కీచకులు, నరరూప రాక్షసులు, తమ వికృత చేష్టలతో చేసిన పని కి యావత్ దేశం నిర్ఘాంతపోతుంది. దేశం ప్రగతి పథంలో ముందుకు పోతుంది….. కాని మత మార్పిడులు ధ్యేయం గా పని చేస్తున్న కొంతమంది మత మౌఢ్యం తలకెక్కించుకున్న నీచులు వల్ల మహిళలు కి ఎన్ని బిల్లులు వచ్చినా రక్షణ ఇచ్చి కాపాడుకోలేమా అనిపిస్తుంది.

భారతదేశ ఐటీ రంగంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న “టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్” (TCS) ప్రతిష్టను మసకబార్చడమే కాకుండా, కార్పొరేట్ సంస్కృతిలోని భయంకరమైన కోణాన్ని “నాసిక్” ఉదంతం బయటపెట్టింది. కేవలం పని ప్రదేశంలో వేధింపులుగా మొదలైన ఈ కథ, లోతుగా పరిశీలిస్తే ఒక వ్యవస్థీకృత మత మార్పిడి కుట్రగా రూపాంతరం చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ దారుణాలు నిన్న మొన్నటివి కావు. పోలీసు విచారణలో తేలిన వివరాల ప్రకారం, 2022 ఫిబ్రవరి నుండి 2026 మార్చి వరకు అంటే సుమారు నాలుగేళ్ల పాటు నాసిక్ యూనిట్‌లో ఒక పద్ధతి ప్రకారం ఈ వేధింపులు సాగాయి. సుమారు ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు మరియు ఒక పురుష ఉద్యోగి ఈ ముఠా చేతిలో చిక్కి నరకాన్ని అనుభవించారు.

ఒక బాధిత మహిళా ఉద్యోగి ధైర్యంగా ముందుకు వచ్చి “దేవులాలి క్యాంప్” పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక నిందితుడు లైంగికంగా వాడుకున్నాడని, ఆపై మతం మారాలని బలవంతం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ​ఈ వ్యవహారం బయటకు రావడంలో నాసిక్ పోలీసులు ప్రదర్శించిన చాకచక్యం అభినందనీయం. ఆఫీసు లోపల ఏదో అనుమానాస్పదంగా జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు, తొందరపడి దాడులు చేయకుండా ఒక వ్యూహాన్ని రచించారు. మహిళా కానిస్టేబుళ్లను హౌస్ కీపింగ్ సిబ్బందిగా మారువేషంలో ఆఫీసులోకి పంపి, కొన్ని రోజుల పాటు అక్కడే ఉంచి ఆధారాలు సేకరించారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ “జిహాదీ” కుట్ర ఒక్కసారిగా బట్టబయలైంది.

ఈ కేసులో నిందితులు కేవలం లైంగిక వేధింపులకే పరిమితం కాలేదు. పోలీసుల విచారణలో మరికొన్ని భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బ్రెయిన్ వాష్ పద్ధతులు ద్వారా నిందితులు బాధిత మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకునేవారు. ఒక బాధితురాలి తండ్రికి పక్షవాతం వస్తే, “మతం మారితేనే మీ నాన్న కోలుకుంటాడు” అని నమ్మించే ప్రయత్నం చేసి మతం మారాలని ఒత్తిడి చేసినట్లు విచారణలో తేలింది.

నిందితులలో ఒకడైన అత్తార్ ఫోన్‌ను స్కాన్ చేయగా, ఒక హిందూ ఉద్యోగికి ముస్లిం వేషధారణ వేసి తీసిన ఫోటోలు లభించాయి. ఇది వారి మత మార్పిడి కుట్రలకు బలమైన సాక్ష్యంగా మారింది. బాధితులను బలవంతంగా హిందూ మతపరమైన ఆచారాలకు విరుద్ధమైన ఆహారం తినమని ఒత్తిడి చేయడం ద్వారా వారి మనోభావాలను దెబ్బతీశారు. ​ఈ ఘటనలో అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాల్సిన హ్యూమన్ రిసోర్స్ (HR) విభాగమే నిందితులతో చేతులు కలపడం. బాధితులు తమకు జరుగుతున్న అన్యాయంపై ముందే మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేసినా, అప్పటి మహిళా HR మేనేజర్ నిందితులకు సహకరించినట్లు తేలింది. ఆమె ఫిర్యాదులను పై అధికారులకు వెళ్లకుండా అడ్డుకోవడం వల్లే ఈ నేరం నాలుగేళ్ల పాటు సాగింది. అంతేగాకుండా MNC కంపెనీ లలో ఇటువంటివి మామూలే అనడం ఆమె పైశాచికత్వానికి నిదర్శనం. అందుకే పోలీసులు ఆమెను కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చి అరెస్టు చేశారు.

ఈ ఉదంతం తీవ్రతను గుర్తించిన TCS యాజమాన్యం మరియు టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గారు దీనిపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. నిందితులుగా ఉన్న 8 మందిని తక్షణమే ఉద్యోగాల నుండి తొలగించారు.

TCS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆరతి సుబ్రమణియన్ నేతృత్వంలో అంతర్గత విచారణ కమిటీని వేశారు. కంపెనీలోని లోపాలను సరిదిద్దడానికి ఇది కృషి చేస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన SIT (Special Investigation Team) ద్వారా నిందితులపై రేప్, స్టాకింగ్, మరియు మతపరమైన భావాలను గాయపరచడం వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నిందితుల పేర్లు : డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, షఫీ షేక్, ఆసిఫ్ అన్సారీ,షారూఖ్ ఖురేషీ,రజా మెమోన్, మరియు HR మేనేజర్ నిదా ఖాన్,….అశ్విని చైనానీ ఈమె పుణెలో ఉండే సీనియర్ మేనేజర్, ఫిర్యాదులను సరిగ్గా పట్టించుకోలేదనే ఆరోపణలతో ఈమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా సెక్షన్ 376 (అత్యాచారం), 354 (లైంగిక వేధింపులు), మరియు మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించడం వంటి కఠినమైన సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేశారు

​ముగింపు:

​ముస్లిం దేశాల్లో ఇటువంటి నేరాలకు బహిరంగంగా కొరడాలతో కొట్టడం లేదా మరణశిక్ష వంటి కఠిన శిక్షలు ఉంటాయి. మన దేశంలో రాజ్యాంగ బద్ధమైన విచారణ ప్రక్రియ ఉన్నప్పటికీ, ఇలాంటి “దేశద్రోహ” చర్యలకు పాల్పడేవారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరగా శిక్షించాల్సిన అవసరం ఉంది అని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. అప్పుడే కార్పొరేట్ రంగంలో పనిచేసే లక్షలాది మంది మహిళలకు భద్రతపై నమ్మకం కలుగుతుంది. మహిళా బిల్లు వంటి వాటికి పరిపూర్ణత చేకూరుతుంది.

​ఈ ఘటన కేవలం ఒక కంపెనీకి సంబంధించిన సమస్య కాదు, దేశ అంతర్గత భద్రత మరియు సామాజిక సామరస్యానికి సంబంధించిన హెచ్చరిక. నిందితులను కఠినంగా శిక్షించడం ద్వారానే ఈ వ్యవస్థపై గౌరవం పెరుగుతుంది.

“గాంధీజీ బ్రతికి ఉంటే మహిళలు తమ ఉద్యోగాలను ధైర్యంగా, ఆఫీస్ లలో నిర్వర్తించిన రోజునే నిజమైన స్వాతంత్ర్యం అనేవారేమో”….. జై హింద్.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading