Download App

“UGC” నిబంధనలు దేశ సమైక్యతకా… విచ్చిన్నానికా…?

జనవరి 31, 2026 By Suresh Thota
మనం ఒక నిర్ణయం తీసుకుంటే… అందరూ హర్షించే విధంగా ఉండాలి… కొందర్ని హరించే విధంగా ఉండకూడదు. ఒక రకంగా చెప్పాలి అంటే…. ఇప్పుడు UGC తీసుకువస్తున్న నియమ, నిబంధనలు మూలంగా లెక్చరర్స్, విద్యార్థుల లో ఉండే స్నేహాన్ని, సమగ్రత ను, ఐకమత్యాన్ని పాడు చేసి… వర్గ, వైషమ్యాలకు మూల...
"UGC" నిబంధనలు దేశ సమైక్యతకా… విచ్చిన్నానికా…?

మనం ఒక నిర్ణయం తీసుకుంటే… అందరూ హర్షించే విధంగా ఉండాలి… కొందర్ని హరించే విధంగా ఉండకూడదు. ఒక రకంగా చెప్పాలి అంటే…. ఇప్పుడు UGC తీసుకువస్తున్న నియమ, నిబంధనలు మూలంగా లెక్చరర్స్, విద్యార్థుల లో ఉండే స్నేహాన్ని, సమగ్రత ను, ఐకమత్యాన్ని పాడు చేసి… వర్గ, వైషమ్యాలకు మూల కారణం అయ్యేటట్లుగా ఉన్నాయి.

కొత్త UGC నిబంధనలు 2026 ముఖ్య ఉద్దేశ్యం

UGC (University Grants Commission) 13 జనవరి 2026 నుండి కొత్తగా కొన్ని నియమాలను విడుదల చేసింది. ఈ నియమాల ప్రధాన ఉద్దేశ్యం: విద్యాసంస్థల్లో ప్రతిభా సమానత్వం, (equity) నమ్మకం పెంచడం, కుల ఆధారంగా, లింగం, అంగవైకల్యం, ప్రాంతం లేదా ఇతర కారణాల తో వివక్ష లేకుండా(discrimination) నివారించడం.

జనరల్ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆందోళనలు ఎందుకు…..? UGC సూచించిన నియమ, నిబంధనలు స్పష్టంగా లేకపోవడం, వివక్ష (Discrimination), వేధింపులు (Harassment), మినహాయింపు (Exclusion) వంటి పదాలకు ఖచ్చితమైన నిర్వచనం లేదు. రోహిత్ వేముల మరియు పాయల్ తాడ్వి ల కేసులను అనుసరించి హడావుడి గా నియమ నిబంధనలు పెట్టినట్టుగా ఉంది అని సోషల్ మీడియాలో ఒక నెటిజన్ పోస్ట్ చేశారు.

దానితో సాధారణ నిర్ణయాలు కూడా అంటే మార్కులు, హాజరు, viva, Lab, student issues వివక్ష, మొదలగు అంశాలు లో భేదభావం చూపిస్తున్నారు, అంటూ ఫిర్యాదులుగా మారే అవకాశం ఉందని వీరి భయం. ఫిర్యాదులలో సమగ్రమైన విచారణ లేకుండా అకారణంగా జనరల్ విద్యార్థులు, అధ్యాపకులు ఎక్కువగా ఇబ్బందులు పాలు అవుతారు. Equity Committees లో ప్రధానంగా SC, ST, OBC ప్రతినిధులు తప్పనిసరి గా ఉంటారు. కాని జనరల్ విద్యార్థులు తరపున ఒక్క ప్రతినిధికి అవకాశం లేదు… దీని మూలంగా సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని జనరల్ విద్యార్థులు అంటున్నారు.

ఉదా : OC విద్యార్థి మీద కోపం తో ఇతర వర్గాల విద్యార్థి కనుక పాత కక్షల నేపధ్యంలో ఇక్కడ నన్ను కుల పేరుతో దూషించాడు అని నిందారోపణ చేస్తే….అనలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత OC విద్యార్థి ది… న్యాయం చెప్పే అవకాశం equity కమిటీది …. కాని అందులో ఒక్కరు కూడా OC వర్గం ప్రతినిధులు లేకపోతే న్యాయం జరిగే అవకాశం ఎంత వరకు ఉంటుంది అని OC విద్యార్థుల వాదన.

24 గంటల్లో విచారణ మొదలుపెట్టీ, 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలి. ప్రాథమికంగా ధృవీకరణ జరిగి నిజ నిజాలు పూర్తి గా తెలుసుకునే లోపు, ఒక్క ఫిర్యాదుతోనే లెక్చరర్ లేదా స్టూడెంట్ పేరు చెడిపోవచ్చు, దీనివల్ల అధ్యాపకులు మార్కులు ఇవ్వడానికే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక జనరల్ అభ్యర్థి మెరిట్ ఆధారంగా మార్కులు వస్తే, పక్షపాతం తో మార్కులు వేశారు అనే ఆరోపణలు రావచ్చనే భయం సహజంగానే వచ్చేస్తుంది. జనరల్ విద్యార్థులు ఓపెన్ డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ కి దూరంగా ఉండే ప్రమాదం ఉంది అని అంటున్నారు…. సోషల్ మీడియాలో నెటిజన్లు… దీని వల్ల విద్యా నాణ్యత ప్రమాణాలు దిగజారిపోతాయి.

ఇది విద్య వ్యవస్థ లో పోటీ తత్వం మీద ప్రభావం చూపుతుందన్న విమర్శలు వస్తున్నాయి. వీటి మీద UGC వ్యవస్థ పరంగా స్పష్టత ఇవ్వలేదు. ఇవి లోప భూయిష్టంగా ఉన్నవి అని విద్యా రంగ నిపుణులు అంటున్నారు.

సుప్రీం కోర్టు ఎందుకు జోక్యం చేసుకుని… ఈ నియమ నిబంధనలు వలన వచ్చే లాభాలు కన్నా, దుర్వినియోగం కి అవకాశం ఎక్కువగా ఉంది అని అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.

ఉద్దేశం మంచిదే వివక్ష (discrimination) తగ్గించాలి కానీ అమలు విధానం సరిగా లేకపోతే జనరల్ విద్యార్థులు కాని , ఉపాధ్యాయులు గాని సైకలాజికల్ దెబ్బ తినే అవకాశం ఉంది. ఫిర్యాదు వచ్చిన తర్వాత 24 గంటల్లో Equity Committee ప్రారంభ చర్యలు తీసుకోవాలి.15 పని రోజుల్లో నివేదిక ఇవ్వాలి, 7 రోజుల్లో వ్యవస్థ చర్యలు తీసుకోవాలని, ఇలా సమయ పరిమితులు ఉన్నాయి.

ఈ నియమాలు యూనివర్సిటీలు,ఉన్నత విద్యాలయ సంస్థలు లో మాత్రమే వర్తిస్తాయి. స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజీల కు ఇవి వర్తించవు. గత కొన్ని సంవత్సరాల్లో UGC కు కులాల వారీగా కుల వివక్షత తో కూడినటువంటి ఫిర్యాదులు పెరిగాయి ఉదా: 2019 నుండి 2020 వరకు 173 కేసులు… 2023 నుండి 2024 మధ్య 378 కేసులు నమోదు కావడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ అస్పష్టమైన నియమాలు, నిర్వచనాల మూలంగా కుల ఆధార వివక్షను ఎలా పరిగణిస్తారు అనేది జనరల్ విద్యార్థులు ఎక్కువగా అడుగుతున్నారు. ఇది దేశ వ్యాప్తంగా ఆందోళన కు కారణం అయింది.

తొందరలోనే UGC, AICTE, మరియు NCTE లను… ఒకే సంస్థ కింద తీసుకువస్తారు అని అంటున్నారు. ఇది ప్రభుత్వంనకు సంబంధం లేకుండా… UGC స్వతంత్ర గా తీసుకువచ్చిన నియమాలు అంతే.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading