Gurtimpu ట్రైలర్ ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు.. వ్యవస్థను ప్రశ్నించే కోర్ట్‌రూమ్ వార్‌లా కనిపిస్తోంది. గంగా ఎంటర్టైన్మెంట్స్, స్వస్తిక్ విజన్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి J. P. Then Pathiyan దర్శకత్వం వహించగా, హీరోగా KJR నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంటోంది.
ట్రైలర్ ప్రారంభం నుంచే ఇది సాధారణ స్పోర్ట్స్ సినిమా కాదనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. “మన దేశానికి నేషనల్ గేమ్ అనేదే లేదు”, “మీరు చూసే పది సెకన్ల వెనకాల నా 29 ఏళ్ల శ్రమ ఉంది సర్”, “మనలాంటి వాళ్లకి గేమ్ అంటే విడుదల” వంటి డైలాగ్స్ నేరుగా హార్ట్‌ను హిట్ చేస్తాయి. ముఖ్యంగా పేద అథ్లెట్ల పరిస్థితి, క్రీడల్లో అవకాశాల కోసం వారు పడే కష్టాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలను చాలా బలంగా ప్రెజెంట్ చేసినట్లు కనిపిస్తోంది.
ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఓ పేద యువకుడు అథ్లెట్‌గా ఎదగాలనే కలతో ప్రయాణం మొదలుపెడతాడు. కానీ ఆ ప్రయాణంలో రాజకీయాలు, అవినీతి, వ్యవస్థలోని అసమానతలు అతడిని అడ్డుకుంటాయి. చివరకు క్రీడా శాఖ మంత్రినే కోర్టుకు లాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అతను కోరుకున్న న్యాయం దక్కిందా? అనే ఆసక్తిని ట్రైలర్ చివరి వరకు కొనసాగించారు.
హీరో కేజేఆర్ ఈ సినిమాలో పూర్తిగా పాత్రలో మునిగిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇంటెన్స్ లుక్స్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా అథ్లెట్‌గా ఆయన ఫిజిక్, కోర్ట్ సీన్స్‌లో ఎమోషనల్ డైలాగ్ డెలివరీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి.
టెక్నికల్‌గా కూడా ట్రైలర్ మంచి స్టాండర్డ్‌లో ఉంది. విజువల్స్ రియలిస్టిక్‌గా ఉండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ను బలంగా ఎలివేట్ చేసింది. కోర్ట్ డ్రామా, స్పోర్ట్స్ ఎమోషన్, సోషల్ కామెంటరీ ఈ మూడు అంశాలను బ్యాలెన్స్ చేస్తూ ట్రైలర్‌ను కట్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది.
మొత్తంగా చూస్తే ‘గుర్తింపు’ ట్రైలర్ పేద అథ్లెట్ల జీవితాల్లోని కఠిన వాస్తవాలను చూపిస్తూ.. స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక బలమైన సోషల్ డ్రామాగా కనిపిస్తోంది. కేవలం గెలుపు-ఓటముల కథ కాకుండా, గుర్తింపు కోసం జరిగే పోరాటాన్ని హైలైట్ చేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది. జూన్‌లో విడుదల కానున్న ఈ చిత్రం ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.