Download App

పవన్ కళ్యాణ్ ను విమర్శించినంత సులభం కాదు పార్టీ నడపడం… జేడీ గారు…

ఫిబ్రవరి 17, 2026 By Suresh Thota
మన బలం తెలుసుకోవడం కన్నా… మన బలహీనత తెలుసుకోవడం ముఖ్యం… తను ఏమిటి, తన బలం ఏమిటి అనేది తెలుసుకోకపోవడం మాజీ ఐపిఎస్, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీ వీ లక్ష్మీనారాయణ బలహీనత… చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయాలలో రాణించారు…. ఉన్నత పదవులు నిర్వర్తించారు. కొంతమంది...
పవన్ కళ్యాణ్ ను విమర్శించినంత సులభం కాదు పార్టీ నడపడం… జేడీ గారు…

మన బలం తెలుసుకోవడం కన్నా… మన బలహీనత తెలుసుకోవడం ముఖ్యం… తను ఏమిటి, తన బలం ఏమిటి అనేది తెలుసుకోకపోవడం మాజీ ఐపిఎస్, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీ వీ లక్ష్మీనారాయణ బలహీనత… చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయాలలో రాణించారు…. ఉన్నత పదవులు నిర్వర్తించారు. కొంతమంది తప్పటడుగులు వేశారు… వారిలో ముఖ్యుడు మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఒకరు.

ఇప్పుడు మేఘా గ్రూప్ లో ‘ఈవీ ట్రాన్స్’ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా, సిబిఐ జేడీగా అంకితభావంతో, చిత్త శుద్ధి తో పనిచేసిన ఆయన, ఇప్పుడు మెగా గ్రూప్ చెందిన పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థ కు సంబంధించి కీలక బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ మోహనరెడ్డి కేసులో దేశవ్యాప్తంగా ఈయన పేరు మారుమ్రోగింది.

తరువాత ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాలలోకి వచ్చారు. జనసేన లో జాయిన్ అయ్యిన విశాఖ పట్టణం నుండి ఓటమి పాలయ్యారు. తదనంతరం…. పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం తప్పు అని, వేలెత్తి చూపుతూ పవన్ కళ్యాణ్ లో నిలకడైన విధి, విధానాలు లేవని చెబుతూ ఆ పార్టీ నుండి నిష్క్రమించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ కు నిలకడైన విధి, విధానాలు ఉన్నాయా అని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ను విమర్శించినంత సులభం కాదు పార్టీ నడపడం… జేడీ గారు…

ఒక వ్యక్తికి యెదైన కష్టం వచ్చినప్పుడు… ఆ కష్ట కాలంలో నేను ఉన్నాను అని నిబడినప్పుడే మన నీతి, నిజాయితీ, నిబద్ధత కు విలువ. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయినప్పుడు, అందరూ రాళ్ళు వేస్తుంటే మీరు కూడా ఆయన పరిస్థితి అర్ధం చేసుకోకుండా రాజీనామా చేసి వెళ్ళిపోతూ మీరు కూడా నిలకడ లేని మనిషి అని ఒక రాయి వేసి వెళ్ళిపోయారు. అటువంటి మీరు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహించడం ఎంత వరకు సబబు అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు.

జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టీ, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఎంత మంది గేలిచేసినా 2014 నుంచి 2024 వరకు నిలబడి, ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని, తన దైన వ్యూహం ప్రకారం తన పార్టీని, పార్టీని నమ్ముకున్న వారిని మాత్రమే కాకుండా, పార్లమెంట్ లో ప్రధాని చేత తుఫాన్ తో పోల్చబడిన పవన్ కళ్యాణ్ కు నిలకడైన విధి, విధానాలు ఉన్నట్టా… లేనట్టా…?

జై భారత్ నేషనల్ పార్టీ పెట్టీ హడావిడి చేసిన మీకు, మిమ్మల్ని నమ్మి వచ్చిన కార్యకర్తలకు ఏమి సందేశం ఇస్తారు అని అడుగుతున్నారు. ఒకర్ని విమర్శించడం చాలా సులభం కాని మనం ఆ మాట మీద నిలబడటం ఎంత కష్టమో ఇప్పుడు ఈయనకు తెలిసి వచ్చినట్టు ఉంది అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

రాజకీయ పార్టీ పెట్టీ, కనీసం రెండు సంవత్సరాల పాటు కూడా నడపటం చేతకాక, పార్టీ ఎత్తేసి, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం లో చేరటం చూస్తే, ఏమి అనాలి మిమ్మల్ని… మీరు ఉద్యోగంలో చేరడం తప్పు కాదు… కాని మీ వాస్తవ బలం మీకు తెలియకపోవడం మాత్రం ఆశ్చర్యం ని కలిగిస్తుంది. అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.

సహనంతో, ఓపికతో, స్థిరంగా ఉన్నట్లు అయితే, ఒక ఎంపీ అయ్యేవాడివి… ఇకనైనా ఆలోచించి నిర్ణయం తీసుకున్న మీరు ఈ రంగంలో అయినా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము అని కొంతమంది సోషల్ మీడియాలో ఈయన నిర్ణయాన్ని స్వాగతించడం గమనార్హం.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading