ఓటిటి న్యూస్

థియేటర్లలో మిస్ అయ్యారా? ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గట్టా కుస్తీ 2’..

Published by
Srinivas

తమిళంలో ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ ‘గట్టా కుస్తీ 2’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో తెలుగులో విడుదల కాకపోయిన ఈ సినిమా, ఇప్పుడు నేరుగా ఓటీటీ ద్వారా తెలుగు వెర్షన్‌తో స్ట్రీమింగ్ కానుంది.

విష్ణు విశాల్, ఐశ్వర్య లెక్ష్మి జంటగా నటించిన ఈ చిత్రానికి చెల్లా అయ్యవు దర్శకత్వం వహించారు. గతంలో మంచి విజయం సాధించిన ‘మట్టి కుస్తీ’కి ఇది సీక్వెల్. తమిళంలో ‘గట్టా కుస్తీ’ పేరుతో వచ్చిన తొలి భాగాన్ని మాస్ మహారాజా రవితేజ సమర్పణలో తెలుగులో విడుదల చేయగా, అది కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది.

దీంతో రెండో భాగాన్ని కూడా తెలుగులో విడుదల చేస్తామని మేకర్స్ తొలుత ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఆ నిర్ణయం మారడంతో ‘గట్టా కుస్తీ 2’ తమిళంలో మాత్రమే థియేటర్లలో విడుదలైంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూడాల్సి వచ్చింది.

ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ‘గట్టా కుస్తీ 2’ తెలుగు వెర్షన్ అధికారికంగా ఈనెల 31న స్ట్రీమింగ్‌కు వస్తోంది. తమిళంతో పాటు తెలుగు, ఇతర భారతీయ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో రానుంది.

స్పోర్ట్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆస్వాదించవచ్చు.

ఈ చిత్రానికి సీన్ రోల్డన్ సంగీతం అందించగా, ఇషారి కె. గణేశన్తో కలిసి విష్ణు విశాల్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు తెలుగు ఓటీటీ రిలీజ్‌తో ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts