
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాతో ఆయన దర్శకుడు Harish Shankarతో రెండోసారి కలిసి పనిచేస్తున్నారు. పవర్ స్టార్ Pawan Kalyan ‘They Call Him OG’తో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న తర్వాత, ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
2026 ఏప్రిల్‌లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక ఓటీటీ బిజినెస్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం Netflix ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. సౌత్ ఇండియన్ అన్ని భాషలతో పాటు హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా నెట్‌ఫ్లిక్స్ చేతికే వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ డీల్ భారీ మొత్తానికి కుదిరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో కథానాయికలుగా Sreeleela, Raashii Khanna నటిస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ Mythri Movie Makers భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సంగీత బాధ్యతలను రాక్‌స్టార్ Devi Sri Prasad చేపట్టారు. ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్ ‘Dekhlenge Saala’ పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి మంచి స్పందనను రాబట్టింది.
మొత్తంగా థియేటర్లతో పాటు ఓటీటీ మార్కెట్‌లోనూ భారీ బిజినెస్ సాధిస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవర్ స్టార్ కెరీర్‌లో మరో క్రేజీ మైలురాయిగా నిలవనుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రిలీజ్‌కు దగ్గరయ్యే కొద్దీ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరగనున్నాయి.
