ఆంధ్ర ప్రదేశ్

మాట తప్పని నైజమే… ‘జనసేనాని’ బలం…

Published by
Suresh Thota

రాజకీయాల్లో నాయకులు ఇచ్చే హామీలకు, అవి అమలుకు నోచుకునే తీరుకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” తాను కేవలం మాటల మనిషిని కాదు, చేతల మనిషిని అని మరోసారి నిరూపించారు. అరకు గిరిజన ప్రాంతంలో ఆయన వేసిన ఒక అడుగు, ఇప్పుడు ఒక గ్రామంలోని విద్యార్థుల భవిష్యత్తునే మార్చివేసింది.

గత సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన, అరకు నియోజకవర్గంలోని “డుంబ్రిగూడ” మండలానికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల లేమితో గర్భిణులు, రోగులు పడుతున్న ఇబ్బందులను గమనించి, “డోలీ రహిత గిరిజన గ్రామాల” స్థాపనే లక్ష్యంగా “అడవితల్లి బాట” అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు “చాపరాయి” నుంచి “పెదపాడు” వరకు నిర్మించతలపెట్టిన రోడ్డుకు ఆయన స్వయంగా శంకుస్థాపన చేశారు.

రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం, డిప్యూటీ సీఎం “పవన్ కళ్యాణ్” పెదపాడు గ్రామంలోని మౌలిక వసతులపై ఆరా తీశారు. ఈ క్రమంలో అక్కడి ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఆ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని, ఏ క్షణాన కూలిపోతుందో అన్నట్లుగా ఉండటం చూసి ఆయన తీవ్రంగా చలించి పోయారు. అక్కడ పరిస్థితిలు చిన్నారుల పడుతున్న అవస్థలను చూసి ఆవేదనకు గురయ్యారు. వాళ్ళ చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో, అక్కడికక్కడే ఆ విద్యార్థులకు మరియు గ్రామస్తులకు ఒక హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ పాత భవనం స్థానంలో ఒక చక్కటి కొత్త “పాఠశాల భవనాన్ని” నిర్మిస్తాం అని మాట ఇచ్చారు.

ఇచ్చిన హామీని విస్మరించకుండా, యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టేలా “పవన్ కళ్యాణ్” చొరవ తీసుకున్నారు. ​సుమారు రూ. 17.50 లక్షల అంచనా వ్యయంతో నూతన భవన నిర్మాణం నకు ఆదేశాలు ఇచ్చి, వెంటనే పనులు పూర్తి చేయించారు. ఆధునిక హంగులతో, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు. ​వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఈ భవనం విద్యార్థులకు అందుబాటులోకి రానుండటం విశేషం.

ఏప్రిల్ 7న, ఆయన మాట తో ప్రారంభమైన ఆ ప్రయాణం, నేడు ఒక నూతన విద్యా మందిర రూపంలో సాకారమైంది. రాజకీయాల్లో విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తూ, గిరిజన బిడ్డల విద్యా హక్కుకు పెద్దపీట వేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం. అని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

ముగింపు: “విద్య లేని వాడు వింత పశువు” అన్నారు…. విద్య కోసం పాఠశాల నిర్మించని ఆ నియోజకవర్గ రాజకీయ నాయకులును ఏమనాలి అని ఒక నెటిజన్ ప్రశ్నించడం ఆలోచించాల్సిన విషయమే… అడవితల్లి బాట విశిష్టతను తెలుపుతూ… నాడు శంకుస్థాపన చేసిన చేతులే.. నేడు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాయి. “పవన్ కళ్యాణ్ మాట తప్పని నైజం, మడమ తిప్పని సంకల్పమే”… నేడు పెదపాడులో కొత్త పాఠశాలగా వెలిసింది అని పెదపాడు గ్రామస్థులు పొంగిపోతున్నారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

Recent Posts