ఆంధ్ర ప్రదేశ్

పిఠాపురంలో విరిసిన విద్యా కుసుమాలకు… అండగా పవన్ కళ్యాణ్

Published by
Suresh Thota

సాధారణంగా రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే రోడ్లు, భవనాలు మాత్రమే అనుకుంటారు. కానీ, నిజమైన అభివృద్ధి మనిషి మేధస్సులో, ఆ మనిషిని తీర్చిదిద్దే విద్యలో ఉందని నమ్మి, ఆచరణలో చూపిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ . పిఠాపురం నియోజకవర్గాన్ని కేవలం ఒక సాధారణ నియోజకవర్గ ప్రాంతంగా కాకుండా, ఒక “జ్ఞాన భాండాగారం”గా మార్చే దిశగా ఆయన వేస్తున్న అడుగులు నేడు యావత్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.

​పదో తరగతి ఫలితాలు రాగానే మార్కులను చూసి విద్యార్ధులకు అభినందనలు తెలపడం ఒకెత్తు.. కానీ, ఆ మార్కుల వెనుక ఉన్న పేదరికాన్ని గుర్తించి, ఆ విద్యార్థుల ఉన్నత చదువులకై బాధ్యత తీసుకోవడం మరొక ఎత్తు. పిఠాపురం నియోజకవర్గంలో 580కి పైగా మార్కులు సాధించిన 31 మంది విద్యార్థుల బాధ్యతను తన భుజాన వేసుకోవడం ద్వారా, తాను “చదువు విలువ తెలిసిన నాయకుడిని” అని “పవన్ కళ్యాణ్” తన నియోజకవర్గం ప్రజలకు తెలియచెప్పి తానేమిటో మరోసారి నిరూపించుకున్నారు.

సాధారణంగా ఉచిత విద్య అంటే ఏదో ఒక కాలేజీలో సీటు ఇప్పించి చేతులు దులుపుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ శైలి వేరు. విద్యార్థులకు ఏ కోర్సు మీద ఆసక్తి ఉంది….? వారు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు….? అని అడిగి తెలుసుకుని, వారి అభీష్టం మేరకే కళాశాలలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించడం విశేషం. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో 598 మార్కులతో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థి నుంచి, కటిక పేదరికంలో ఉన్న విద్యార్థుల వరకు అందరినీ ఒకేలా ప్రోత్సహించడం ఆయనలోని మానవత్వానికి నిదర్శనం.

ఇప్పటికే తల్లిదండ్రులు లేని బిడ్డలకు తనకు ప్రభుత్వం నుండి వచ్చే, సొంత జీతం నుంచి నెలకు 5 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ వారి కళ్ళలో ఆనందాన్ని చూసున్నారు. ఆయన ఇస్తున్న ప్రోత్సాహం తో ఇప్పుడు అదే విద్యార్థుల్లో ఏడుగురు పదో తరగతిలో అద్భుత ప్రతిభ కనబరచడం, వారికి ఉచితంగా ఉన్నత విద్యను అందించేలా విద్యా సంస్థలను ఒప్పించడం ద్వారా పిఠాపురం లో ఒక గొప్ప సరస్వతి యజ్ఞం ను కొనసాగిస్తున్నారు.

​”మన నాయకుడు మనల్ని గమనిస్తున్నాడు, మనం బాగా చదివితే ఆయన మనకు తోడుగా ఉంటారు” అనే నమ్మకం నేడు పిఠాపురంలోని ప్రతి విద్యార్థిలోనూ కలుగుతుంది. ఒక నాయకుడు విద్యార్థులకు రోల్ మోడల్‌గా మారడం అంటే ఇదే, ఆ నియోజకవర్గ విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం కావడమే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లక్ష్యం.

​ముగింపు: ​రాజకీయాలు అంటే ఎన్నికలు, ఓట్లు మాత్రమే కాదు.. ఒక తరాన్ని తీర్చిదిద్దడం కూడా అని పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు. విద్యాసంస్థలను సమన్వయం చేస్తూ, రూపాయి ఖర్చు లేకుండా పేద విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మార్చేందుకు ఆయన తీసుకున్న ఈ చొరవ అభినందనీయం. పిఠాపురం లో ప్రజలు, విద్యార్ధుల తల్లిదండ్రులు గర్వంగా చెబుతున్నారు… “మాకు చదువు విలువ తెలిసిన నాయకుడు ఉన్నాడు” అని…ఆయనే పవన్ కళ్యాణ్.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.