ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి బ్రతుకుతుంటాడు….. కొంత మంది స్వార్థం తో, ఇంకొంతమంది ఎదుటి వారిని దోచుకోవడం కోసం…. ఇలా రకరకాలు గా బ్రతుకుతారు. కాని తన జీవితానికి సార్థకత చేకూర్చుకునేవాడు…. చరిత్రలో నిలిచిపోతాడు. అలా తన కోసం కాక అనుక్షణం ప్రజలకోసం పరితపించే వ్యక్తి “నారా లోకేష్”. అనడానికి నిదర్శనం ఈ క్రింది సంఘటన.
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సంక్షేమానికి కీలకంగా నిలిచిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) కార్యకలాపాలకు ఎదురైన అడ్డంకులు తొలగించే నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్య సంఘటన విషయంలో నారా లోకేష్ వ్యవహరించిన తీరు, చొరవ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
పేదలకోసం మాట నిలబెట్టుకున్న లోకేష్ తీరు నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. పేదల విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి విదేశీ నిధులు నిలిచిపోవడం వల్ల ఏర్పడిన సమస్యను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని మంత్రి “లోకేష్” నెరవేర్చారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విదేశీ నిధుల విషయంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టింది. కొంతమంది ఈ విదేశీ నిధులను దేశ ద్రోహ చర్యలకు ఉపయోగించడం, మత మార్పిడులు కు పాల్పడటం మూలంగా వీటిపై ఆచి తూచి అడుగులు వేస్తుంది. దీని మూలంగా కొన్ని నిజమైన సేవ చేసే సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. అందులో (RDT) రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఒకటి. మంత్రి నారా లోకేష్ కేంద్రంతో చర్చలు జరిపి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) కింద ఉన్న అడ్డంకులను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. అసాధ్యం అనుకున్న సమస్యను తనదైన శైలిలో పరిష్కరించడం ద్వారా లోకేష్ తన రాజకీయ ప్రతిభను మరోసారి నిరూపించారు.
ప్రజల ఆశాజ్యోతి ఆర్డీటీ… దీనిని 1969 స్పెయిన్ లో జన్మించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అనంతపురం జిల్లాకు వచ్చి స్థాపించారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలను వారి కుమారుడు మాంచో పెర్రర్ నిర్వహిస్తూన్నారు. పేదలకు విద్యా, వైద్య సేవలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ లక్షలాది కుటుంబాలకు ఆర్డీటీ ఒక ఆశాకిరణంగా నిలిచింది. నిధుల సమస్యతో సేవలు అంతరాయం కలగొచ్చని భావించిన సమయంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల్లో ఊరట నింపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్డీటీ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. “ఇది ఒక మంత్రికి చెప్పే ధన్యవాదం మాత్రమే కాదు, లక్షలాది పేదల ఆశీస్సులు” అని ఫెర్రర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, “దశాబ్దాలుగా ఆర్డీటీ చేస్తున్న సేవల ముందు తాను చేసినది చాలా చిన్న పని”….. అని వినయంగా వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంతో సమన్వయం ఫలితంగా ఈ సమస్య కు పరిష్కారం దొరికింది అని అన్నారు.
గతంలో విదేశీ నిధులు నిలిపివేయడంతో ఆర్డీటీ కార్యకలాపాలు సంక్షోభంలో పడగా, ఈ విషయాన్ని ఫెర్రర్ లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేష్, కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. తాజాగా కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడంతో నిధుల రాకకు మార్గం సుగమమైంది.
ఈ సమస్య పరిష్కారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంతో సమన్వయం చేస్తూ కీలక పాత్ర పోషించారు. కేంద్రమంత్రి అమిత్ షా దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసినట్టు అధికారులు తెలిపారు.
కేంద్ర నిర్ణయంతో ఇకపై ఆర్డీటీ సేవలు నిరాటంకంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ సంస్థకు మరోసారి బలమైన మద్దతు మంత్రి నారా లోకేష్ రూపంలో లభించినట్టైంది.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సంక్లిష్ట సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేష్, ఈ ఘటనతో మరోసారి ప్రజా నాయకుడిగా, ప్రజల మనసు చూరగొన్నారని, తండ్రి కి తనయుడు అనిపించుకుంటున్నారని….. అధికారులు అంటున్నారు.