ఆంధ్ర ప్రదేశ్

చేనేతకు చంద్రబాబు భరోసా: ఉచిత విద్యుత్ పథకంతో కొత్త వెలుగు

Published by
Srinivas

గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న చేనేత రంగానికి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త ఊపునిస్తోంది. తన హామీలను కార్యరూపం దించాలని నిశ్చయించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర చేనేత కార్మికుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని నేడు ప్రారంభించారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మరియు ఐటీ, పరిశ్రమల మంత్రి నారా లోకేష్ గారు చేనేత కళాకారులను కలుసుకుని వారి కష్టం, సృజనాత్మకతను కళ్లారా చూశారు. రాట్నం తిప్పుతూ, మగ్గం నేస్తున్న కార్మికులతో నేరుగా సంభాషించడంలో నేతల నిబద్ధత స్పష్టంగా కనిపించింది.

కొన్ని నెలల క్రితం పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా పాముల నాయక్ ఇంటిని సందర్శించిన చంద్రబాబు, వారి పేదరికాన్ని చూసి ఇంటి హామీ ఇచ్చారు. నేడు ఆ హామీని నిలబెట్టుకుని మంగళగిరి నియోజకవర్గంలో పాముల నాయక్ కుటుంబానికి ఇంటి పత్రాలు స్వయంగా అందజేశారు.

“చంద్రబాబు గారి మేలు మేము ఈ జన్మలో మరచిపోలేము,” అంటూ ఆ కుటుంబం కంటతడి పెట్టారు.

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, ముఖ్యంగా ఆచార సంప్రదాయాలకు ఆధారమైన రంగాలకు ఊతమివ్వడంలో ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.