
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మరో ప్రధాన హామీ ‘తల్లికి వందనం’ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం ద్వారా లక్షలాది తల్లులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది.
ముఖ్యాంశాలు:
- రేపు అధికారికంగా ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం
- మొత్తం 67 లక్షల తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లు నేరుగా జమ చేయనున్న ప్రభుత్వం
- ఈ పథకం 67,27,164 మంది విద్యార్థులను కవర్ చేయనుంది
- ఒక తల్లి ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికి లబ్ధి అందేలా పథకం అమలు
- 1వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా వర్తింపు
- అడ్మిషన్లు పూర్తయ్యాక, డేటా వచ్చిన వెంటనే తల్లుల ఖాతాల్లో నిధులు జమ
- నేడు జీఓ విడుదల, విధివిధానాలు ఖరారు

ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా:
- పింఛన్ల పెంపు
- అన్నా క్యాంటీన్లు
- మెగా డీఎస్సీ
- దీపం-2 పథకం
వంటి హామీలను అమలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు తల్లికి వందనంను కూడా ఆ జాబితాలో చేర్చింది.
ఇది తల్లుల గౌరవానికి మాత్రమే కాకుండా విద్యార్ధుల శ్రేయస్సు కోసం తీసుకున్న ముఖ్యమైన ముందడుగు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
