Download App

మక్కిలు ఇరగొట్టి కింద కూర్చోబెడ్తాం – పవన్ కళ్యాణ్ ఫైర్

జూన్ 23, 2025 • By Srinivas
వైఎస్సార్సీపీపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన 'తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్న పవన్, ఊహించని స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. "తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు మేము కాదు. మేము...
మక్కిలు ఇరగొట్టి కింద కూర్చోబెడ్తాం – పవన్ కళ్యాణ్ ఫైర్

వైఎస్సార్సీపీపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న పవన్, ఊహించని స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు మేము కాదు. మేము సహించడానికి సిద్ధంగా లేము. బ్యానర్లు పట్టుకుని గొంతులు కోసేస్తాం అంటారా? మక్కిలు ఇరగొట్టి కింద కూర్చోబెడ్తాం. ఈ పిచ్చి వేషాలు వేయకండి,” అంటూ పవన్ మండిపడ్డారు.

ఇటీవల పల్నాడు పర్యటనలో వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులు “రప్ప రప్ప” అనే ప్లకార్డులు పట్టుకుని చేసిన హంగామాపై వ్యాఖ్యానిస్తూ – “ఆ ప్రభుత్వం మళ్ళీ రాదు… రావట్లేదు” అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading