కడప పేరు చెప్పగానే జగన్ గుర్తొస్తారు. అంతకంటే ముందు వైఎస్ఆర్ గుర్తొస్తారు. అలాంటి ఊరిలో మహానాడు నిర్వహించాలన్న ఆలోచన ఎవరికొచ్చింది, వెనకున్న మాస్టర్ మెండ్ ఎవరు..?
కడప నడిబొడ్డున ఈసారి టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. ఇప్పటికే కడప నగరం టీడీపీ జెండాలతో పసుపుమయమైంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాలుండగా, ఎన్నడూ లేని విధంగా ఈసారి కడపలోనే మహానాడు నిర్వహించాలని ఎందుకు నిర్ణయించారు.. ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు.. దీని వెనక కారణం ఏంటి.. వీటన్నింటీ వెనక ఉన్న ఒకే ఒక్క వ్యక్తి నారా లోకేష్.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పెద్ద ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులు సీమకే వస్తున్నాయి. దీంతో కడప-రాయలసీమ అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందనే వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లినట్లు అయింది.
అల్టిమేట్ గా ఏ ప్రాంత ప్రజలు అయనా చూసేది అభివృద్ధినే. ఇన్నాళ్లు కడపను వైసీపీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కడప రూపురేఖలే మారిపోయేలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ఇక్కడి ప్రాంత ప్రజలు టీడీపీకి అండగా నిలబడేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ఏ పార్టీ విజయానికి అయినా కార్యకర్తలే మూలం, బలం. వారి అండ లేకపోతే ఏ పార్టీ మనుగడ సాధించలేదు. దీంతో.. కడపలో ఉన్న క్యాడర్ కు ఈసారి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని అనుకుంటున్నారు లోకేష్. అక్కడున్న క్యాడర్ కు ప్రాధాన్యత ఇస్తే.. వారు పార్టీకి అండగా నిలబడతారు. వాళ్లల్లో ఆ భరోసా రావాలంటే మహానాడు లాంటి పార్టీ కార్యక్రమాన్ని కడపలో నిర్వహించడం కరెక్ట్. లోకేష్ ఇప్పుడు అదే పని చేశారు.