
మాజీ ముఖ్యమంత్రి,స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు గానే కాకుండా తన కంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న వ్యక్తి నారా లోకేష్.
టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి “నారా లోకేష్”. టీడీపీ 44 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, భవిష్యత్తు నాయకత్వ వారసత్వాన్ని మరియు పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు ఈ కొత్త పదవిని ఏర్పాటు చేశారు. పార్టీ మీద పూర్తిగా అవగాహన, కార్యకర్తల తో డైరెక్ట్ గా అందుబాటులో ఉండేందుకు ఈ పదవి సృష్టించబడింది. గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామ్స్ పెరిగి,యువత తో కనెక్ట్ అయ్యే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి.
సోషల్ మీడియా, జిల్లా క్యాంపెయిన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండొచ్చు. అంటే “డైలీ ఆపరేషన్స్” లో స్పీడ్ ఉంటుంది. పార్టీ కార్యక్రమాలు జిల్లాల వరకూ ఫాస్ట్‌గా అమలు కావడం. ఎలక్షన్ టైమ్‌లో క్యాంపెయిన్ మేనేజ్‌మెంట్ కాస్త సిస్టమాటిక్‌గా మారడం ఇవి అన్ని ఆయన చేతుల మీదుగానే జరుగుతాయి. సరి అయిన సమయంలో సరైన పోస్ట్ అంటూ…. అభిమానుల సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కార్యకర్తే అధినేత అనే నినాదంతో పార్టీని యువశక్తితో ఉరకలు వేయిస్తున్న మంత్రి లోకేష్ కు అధిష్టానం టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పచెప్పింది. కార్యకర్తల కోసం సంక్షేమ విభాగాన్ని నెలకొలిపి, సభ్యత్వం తీసుకున్నవారికి ప్రమాదబీమా కల్పించి, పనిచేసే కార్యకర్తల ను గుర్తించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పార్టీ నీ బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్న ఆయన కు ఈ బాధ్యత అప్పజెప్పారు. ఇవి నారా లోకేష్ యొక్క ప్రతిభ కు,ఆయన శైలి కి నిదర్శనాలు.
యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రాన్ని చుట్టి వచ్చి ప్రజల, కార్యకర్తల పరిస్థితి లను చూసి, తనకంటూ ఒక ఐడియాలజీ తో రాష్ట్ర ఆర్థిక వనరులను, తన ఆలోచనలతో పరిపుష్టం చేస్తూ ముందుకు సాగుతున్న ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి ఇవ్వడం ద్వారా ఒక బృహత్తరమైన బాధ్యత ను ఆయన భుజస్కందాలపై మోపారు.
అసలు టీడీపీ పార్టీ లో నిర్మాణ స్థాయిలు ఈ విధంగా ఉంటాయి.
పార్టీ అధ్యక్షుడు: నారా చంద్రబాబు నాయుడు
వర్కింగ్ ప్రెసిడెంట్
పోలిట్‌బ్యూరో
జాతీయ కమిటీ
రాష్ట్ర కమిటీ
నియోజకవర్గ/మండల/గ్రామ కమిటీలు: క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే నెట్‌వర్క్.
అనుబంధ విభాగాలు: తెలుగు యువత, తెలుగు మహిళ, రైతు విభాగం, ఐటీ విభాగం మొదలైనవి ఉంటాయి.

పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవాన్ని లెక్కలోకి తీసుకుని పదవులు ఇచ్చిన అధిష్టానం. పనిచేసేవారికే పార్టీలో పెద్దపీట అన్న సంకేతాన్ని ఇచ్చిన పార్టీ. కార్యకర్తే పార్టీకి అధినేత అన్న వినూత్న ఆలోచనలతో పార్టీని తిరుగులేని సైన్యంగా తీర్చిదిద్దుతున్న మంత్రి లోకేష్ కు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పచెప్పింది.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి “పల్లా శ్రీనివాస్” నియమించబడ్డారు.. 29 మందితో పొలిట్ బ్యూరో నియామకాలు జరిగాయి. 31 మందితో కూడిన జాతీయ కమిటీలో ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు కాగా 18 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 10 మందిని జాతీయ అధికార ప్రతినిధులుగా నియమించింది.
రాష్ట్ర కమిటీలో 185 మంది సభ్యులు ఉన్నారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మందికి అనగా బీసీ 77, ఎస్సీ 25, ఎస్టీ 7, మైనార్టీ 13 మంది సభ్యుల కు చంద్రబాబుగారు చోటు కల్పించారు. రేపు పార్లమెంటు లో మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న వేళ… టీడీపీ రాష్ట్ర కమిటీలోని 185 మందికి గానూ… 50 మంది మహిళల కు చోటు కల్పించింది. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించింది.
ఈ సారి పార్టీకి నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాగా, ఆయన అంచనాలను అందుకునేలా యువ నాయకత్వం ను కమిటీల్లోకి తీసుకువచ్చారు. అలాగే నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం జరిగింది. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్ద పీట వేశారు.
