ఆంధ్ర ప్రదేశ్

సీసీటీవీ ఫూటేజీ ఎక్కడ జగన్?

Published by
Srinivas

ఏలూరు సాక్షి కార్యాలయంపై జరిగిన దాడితో, వైఎస్ జగన్ కొత్త డ్రామాకు తెరదీశారని ఆరోపిస్తోంది కూటమి ప్రభుత్వం.

మహిళల మీద నీచమైన కామెంట్స్ చేసి, ఆ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా కొత్త ఎత్తుగడ వేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా సాక్షి కార్యాలయంపై దాడి జరిగితే దానికి సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

రెండు నెలల క్రితం ప్యాలెస్ ముందు గార్డెన్ ను జగన్ తనుకుతానే తగలబెట్టుకున్నారని, దాన్ని చంద్రబాబు మీద తోశారని అంటున్నారు కూటమి నేతలు. ఇప్పుడు ఏలూరులో సాక్షి కార్యాలయనికి కూడా తామే నిప్పు పెట్టుకుని, ఆ తప్పును టిడిపి పై తోసేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఆరోజు గార్డెన్ లో ఘటన జరిగినప్పుడు సీసీ ఫూటేజ్ ను పోలీసులు ఇవ్వమని అడిగినా ఇవ్వలేదని.. ఇప్పుడు సాక్షి కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కూడా సీసీటీవీ ఫూటేజ్ ఇవ్వడం లేదని అంటున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.