ఆంధ్ర ప్రదేశ్

కొత్త కుట్రలకు జగన్ కుతంత్రం

Published by
Srinivas

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న వేళ, కొత్త కుట్రలకు తెరదీసింది వైసీపీ. ఓవైపు రాష్ట్రమంతా పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో.. ఆ ఆనందం లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ కుట్రలకు తెరలేపారు.

ఏలూరులో సొంత కంపెనీ సాక్షి ఆఫీస్ కు నిప్పుపెట్టుకుంది ఆ పార్టీ. తన ఆఫీస్ కు తానే నిప్పు పెట్టుకొని, కొత్త కుతంత్రాలకు తెరదీసింది. నాడు తన ఇంటి దగ్గర తానే నిప్పు పెట్టుకున్నట్లు ఇప్పుడు ఏలూరులో తన సాక్షి ఆఫీసుకు నిప్పు పెట్టుకుని.. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది.

అమరావతి మహిళలపై వేశ్యలంటూ వ్యాఖ్యలు చేయించింది సాక్షి మీడియా. రాష్ట్రవ్యాప్తంగా జనాగ్రహం పెల్లుబికితే.. దాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఏలూరులో తన ఆఫీస్ కి తానే నిప్పు పెట్టుకుని నిందను టీడీపీపై, అమరావతి మహిళలపై మోపుతున్నారు జగన్.

జగన్ కుతంత్రాల్ని టీడీపీ నేతలు తిప్పికొడుకున్నారు. ఇకపై కుట్ర రాజకీయాలు చెల్లవని, జగన్ తన చీప్ పాలిటిక్స్ మానేసి, సైలెంట్ గా ప్యాలెస్ లో కూర్చుంటే మంచిదని అంటున్నారు. కూటమి సుపరిపాలనను ఆంధ్రా ప్రజలు పండగలా జరుపుకుంటారని అంటున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.