వైసీపీ ఖబడ్దార్.. చంద్రబాబు వార్నింగ్

Published by
Srinivas

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు గింజుకుంటున్నారని, ఇకపై వాళ్ల ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు.

“వైసీపీ నేతలు గింజుకుంటున్నారు. మీ ఆటలు ఇకపై సాగనివ్వను, ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. ఊరుకుంటే రెచ్చిపోతున్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ ఇవ్వమంటున్నాను. అలా అని చెప్పి దబాయిస్తే ఇస్తామనుకుంటే మాత్రం పగటి కల.” 

వైసీపీ నేతలు రాజకీయాల్ని కలుషితం చేశారని, రాజకీయ ముసుగులో నేరాలు-ఘోరాలు చేశారని, తప్పు చేసిన వాళ్ల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు ముఖ్యమంత్రి.

సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు చంద్రబాబు. ఎన్డీఏకు చెందిన కొంతమంది నాయకులు, వైసీపీతో చేతులు కలిపారనే విషయం తనకు తెలిసిందని, అలాంటి వాళ్లు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు ముఖ్యమంత్రి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.