వర్మకు మరోసారి నోటీసులు

Published by
Srinivas

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి చిక్కులు ఎదురయ్యాయి. ఆయనపై ఇప్పటికే ఆంధ్రా పోలీసులు కేసు నమోదు చేసి, ఓసారి విచారణకు కూడా పిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ  సీఐడీ వర్మకు నోటీసులిచ్చింది. విచారణకు హాజరవ్వాలని అందులో సూచించింది.

అమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తీశాడు వర్మ. ఇది కొంతమంది మనోభావాలు దెబ్బతీసిందంటూ వర్మపై మంగళగిరి, అనకాపల్లి, ఒంగోలులో సీఐడీకి ఫిర్యాదులొచ్చాయి. వీటిపై విచారణకు రావాల్సిందిగా వర్మకు నోటీసులందాయి.

రామ్ గోపాల్ వర్మ మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. ఇంతకుముందు లానే కోర్టు డైరక్షన్ లో నడుచుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారు.

కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే టైటిల్ తో సినిమా తీశారు వర్మ. ఆ తర్వాత కొన్ని సెన్సార్ కారణాల వల్ల దాన్ని అమ్మరాజ్యంలో కడపరెడ్లుగా మార్చారు. అలా తీసిన ఆ సినిమా 2019లో రిలీజైంది. అందులో పవన్ కల్యాణ్, నారా లోకేష్ పాత్రధారులపై కొన్ని వివాదాస్పద సన్నివేశాలు చిత్రీకరించారని, కులాల్ని రెచ్చగొట్టేలా సినిమా ఉందంటూ ఆర్జీవీపై కేసులు పడ్డాయి. 

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.