జాతీయం

తిరువనంతపురంలో… కమల వికాసం

Published by
Rahul N

కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జయ కేతనం ఎగురవేసింది. దేశం లోనే అత్యధిక అక్షరాస్యత కేరళలో ఉంది. ప్రస్తుత అక్షరాస్యత రేటు సుమారు 95% పైన ఉంది. అంత చదువు కున్న ఆ రాష్ట్ర రాజధాని లో బీజేపీ గెలవడం దేశంలో మారుతున్న జన ఆలోచన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.

ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయ బావుటా ఎగరవేయడం…..అది కూడా సింగిల్ గా 50 స్థానాల్లో….. ప్రస్తుత ప్రభుత్వాన్ని కలవర పాటు కు గురిచేస్తున్నది, అని రాజకీయ పండితులు, విశ్లేషకులు అంటున్నారు……ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం వచ్చే సంవత్సరం 2026 జూన్ కి ముగిసే అవకాశం ఉంది కాబట్టి, తదుపరి ఎన్నికలు 2026 ఏప్రిల్-మేలో జరగనున్నాయి.

ఇది ఆషా మాషి గా తీసుకునే అవకాశం లేదు అక్కడ పినరయి విజయన్ ప్రభుత్వం. గతం లో 2021 ఎన్నికలు: LDF 99 సీట్లు, UDF 41, BJP 0. 2016: LDF 91, UDF 47, BJP 1.

ఈ సారి కేరళలో LDF గెలిచే అవకాశం కనపడడం లేదు … అందుకు ఆరంభం ఈ కార్పొరేషన్ ఎన్నికలు. బీజేపీ పూర్తి గా గెలిచే అవకాశాలు కూడా లేవు కాని ఓటింగ్ శాతం పెంచుకుని. నిర్ణయాత్మక మైన పాత్ర పోషించబోతుంది అంటున్నారు కేరళ నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు. అక్కడ ఉన్న హిందూ, క్రిస్టియన్ ఓటింగ్ కొంతమేరకు కలవబోతుంది అంటున్నారు. అందుకు నిదర్శనం ఈ మున్సిపల్ ఎన్నికల సరళి.
ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే రిటైర్డ్ డీజీపీ శ్రీలేఖ బీజేపీ లో జాయిన్ అయ్యి కార్పొరేటర్ గా గెలిచింది. మేయర్ రేసులో ఆమె ముందంజ లో ఉన్నారు. డిల్లీ పెద్దల ఆశీర్వాదం కూడా ఆమెకే ఉందని అంటున్నారు. 101 సీట్లకు గాను 50 సీట్లను బీజేపీ గెలుచుకోవడానికి కారణం హిందూ, క్రిస్టియన్ ఓట్లు కలవడం అని అంటున్నారు.

ఇక్కడ కేరళ ఫైల్స్ మూవీ లో చూపించినట్లుగా, లవ్ జిహాద్ , డ్రగ్స్, కొన్ని వర్గాల మతపరమైన విధానాల మూలంగా కొన్ని వర్గాల్లో అసహనం మొదలైంది..

ఉదా: Kerala Catholic Bishops Council (KCBC): డ్రగ్స్, లవ్ జిహాద్‌పై సెమినార్లు నిర్వహించి LDF విధానాలు పై విమర్శల ద్వారా బహిరంగంగా పిలుపునివ్వడం మొదలుపెట్టాయి. MP శశిథరూర్ అంటీముట్టనట్లు గా ఉండటం కూడా బీజేపీ కి కలసి వచ్చింది అంటున్నారు.

హిందువులు 54.73% నుండి 52.61%కి (-2.12%), క్రిస్టియన్లు 18.38% నుండి 17.87%కి (-0.51%), ముస్లింలు 26.56% నుండి 29.14%కి (+2.58%) అయ్యాయి.

ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేరకు పలితాలు చూపిస్తాయి అనే చర్చ అన్ని వర్గాల్లోనూ ఆశక్తి రేపుతుంది. ఎందుకంటే అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రం కదా…!

Rahul N