చంద్రబాబు ప్రజలను మాయలో పడేస్తున్నారు – బీజేపీ ఎంపీలు మౌనంగా ఎందుకు ఉన్నారు?: జగదీష్ రెడ్డి
June 26, 2025 Published by Rahul N

ప్రధాని మోదీకి చంద్రబాబుతో రాజకీయ అవసరం ఉంది కాబట్టే ఆయనపై ఎలాంటి విమర్శలు చేయడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అయితే తెలంగాణలో బీజేపీ ఎంపీలను గెలిపించింది తెలంగాణ ప్రజలే అని ఆయన గుర్తు చేశారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా, ఆ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారు అని తీవ్రంగా ప్రశ్నించారు.
“నీరు సముద్రంలో కలుస్తుంది అనేది ఒక పెద్ద కుట్ర. ఇది చంద్రబాబు ప్రచారం చేస్తున్న మాయ. ఆయన తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించి, తాను సమస్యల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు,” అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
రాజకీయ లబ్దిని పక్కన పెట్టి, బీజేపీ ఎంపీలు ప్రజల పక్షాన నిలవాలి, పోరాటం చేయాలి అని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. “మిగులు జలాలు సముద్రంలో కలుస్తాయి” అనే వాదనను బీఆర్‌ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు.
