జాతీయం

థిక్కారం సైతునా…?

Published by
Srinivas

తమిళనాట DMK , కాంగ్రెస్ రాజకీయాలు సరికొత్త నాటకీయతకు లోనై వాళ్ళు చేస్తున్న చేష్టలు కూర్చున్న కొమ్మను నరుక్కునేటట్టు ఉన్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హిందూ ఓట్లు మాకు వద్దు, మైనారటి ఓట్లే మాకు ముద్దు అన్న ధోరణిలో వెళుతున్నాయి. తిరుప్పుకుండ్రం కార్తీక దీపం కేసులో కోర్టు తీర్పును పట్టించుకోకుండా తాత్సారం చేయడం తో హిందూ మున్నాని నేత రామ రవికుమార్ మరొకసారి కోర్ట్ మెట్లు ఎక్కారు.

అసలు ఏమి జరిగింది అంటే….

మద్రాస్ హైకోర్టు జడ్జి జి. ఆర్. స్వామినాథన్ తిరుప్పుకుండ్రం కొండపై వేంచేసి ఉన్న మురుగన్ (సుబ్రమణ్య స్వామి) దేవాలయంలో ఉన్న దీపస్తంభం దగ్గర దీపం వెలిగించడానికి, ఆయన అనుమతిచ్చిన తీర్పు (“కార్తిగై దీపం”) ను వ్యతిరేకిస్తూ…. ప్రియాంక గాంధీ, కనిమొళి మరియు INDIA కూటమి కి చెందిన సుమారు 120 మంది ఎంపీలు కలిసి, లోకసభ స్పీకర్ కు ఆయన పై అభిశంసన నోటీసు అందించారు. ఆయన తీర్పుపై సందేహాలు ఉన్నాయని ఆ నోటీసులో…. ముఖ్యంగా మూడు ప్రధాన ఆరోపణలు చేశారు. నిష్పక్షపాతం , పారదర్శకత, లౌకికతను దెబ్బతీసే విధంగా ఆయన తీర్పు ఉందని అందులో ప్రస్తావించారు. ఇలా కోర్టు ఆదేశాలు, న్యాయమూర్తి మీద పిర్యాదుతో కోర్టులు కూడా చాలా స్ట్రాంగ్గా స్పందిస్తున్నాయి.

కాని ఈ india కూటమిలో అందరికీ తెలుసు ఈ కేసు నిలవదని… ఎందుకంటే…

దీనికి పూర్వం 1923 , 1926, 1930 లలో పాత కోర్టు ల తీర్పు ల ప్రకారం వాటిని ఉటంకిస్తూ జడ్జి G R స్వామినాథన్ ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చారు. ఆ కొండ హిందువులదే, ఇంచు మించు 170 ఎకరాల కొండ, దాని మీద తరువాత అక్రమంగా వేరేవి వెలిశాయి, ఎక్కడ అయితే కార్తీక దీపం వెలిగించాలి అని అనుకుంటున్నారో ఆ స్థలము దేవాలయమునకు చెందినదే అక్కడ శతాబ్దాలుగా దీపం వెలిగించే సంప్రదాయం వుంది అని అప్పటి శిలా శాసనాలు, సాక్ష్యాలు ఆధారంగా తీర్పుని ఇచ్చారు. సాక్ష్యాల ప్రకారం ఎవ్వరూ ఆపటానికి వీలు లేదు. కోర్టు ఆదేశాలు పాటించాల్సిందే అని డీఎంకే ప్రభుత్వంనకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఈ ఆదేశాలను డీఎంకే ప్రభుత్వం పట్టించుకోకుండా బేఖాతరు చేసింది.

తిరుప్పరంకుండ్రం కొండపై దీపస్తంభం వద్ద కార్తిక దీపం వెలిగించాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర పోలీసు అమలు చేయకపోవడంతో, కోర్టు దీనిని కోర్టు ధిక్కారంగా తీసుకుని చీఫ్ సెక్రటరీ, తమిళనాడు ప్రభుత్వం మరియు అదనపు DGP (Law & Order), చెన్నైలను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

“అధికారుల పని చట్టాన్ని అమలు చేయడం… ఓరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అనుసరించడం కాదు!” అని వ్యాఖ్యానించడం గమనార్హం.

తమిళనాడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు నెటిజన్లు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts