తెలంగాణ

తెలంగాణలో భారీ వర్షాలు : మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సూచనలు

Published by
Rahul N

తెలంగాణ రాష్ట్రంలో ఈ బుధవారం నుండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ అన్ని ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆయన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు మరియు సిబ్బంది ఈ మూడు రోజులు పూర్తిగా హాస్పిటల్స్‌లోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, గర్భిణులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే వైద్యం పొందేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

ప్రత్యేకంగా, ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ దగ్గర ఉన్న గర్భిణులను హాస్పిటల్స్‌లోని బర్త్ వెయిటింగ్ రూమ్స్‌లో తరలించి, తక్షణమే సేవలు అందించాల్సిందిగా మార్గనిర్దేశం చేశారు. అంతేకాక, అంబులెన్స్‌లు, 102 వాహనాలు సిద్ధంగా ఉంచి, ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చినా 24 గంటల అందుబాటులో డ్రైవర్లు మరియు EMTలను ఉంచాలని కూడా తెలిపారు.

అలాగే, అన్ని ఉన్నతాధికారులు మరియు సిబ్బందిని సెలవులు రద్దు చేయాలని మంత్రి ఆదేశించారు, తద్వారా ఏ విధమైన వైద్య సంక్షోభం లేకుండా ప్రతి రోగికి తక్షణమే సహాయం అందించవచ్చని తెలిపారు.

Rahul N