Download App

తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఆగస్టు 15 నుంచి పంపిణీ

ఆగస్ట్ 12, 2026 • By Rahul N
తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత వ్యవస్థలో మరో కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఆగస్టు 15న శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే రోజున రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఆగస్టు 15 నుంచి పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత వ్యవస్థలో మరో కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఆగస్టు 15న శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే రోజున రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,28,092 ఆహార భద్రత కార్డులు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వీటి పరిధిలో సుమారు 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తోందని చెప్పారు.

స్మార్ట్ రేషన్ కార్డుల అమలుతో ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, సామర్థ్యం తీసుకురావడంతో పాటు లబ్ధిదారులకు సేవలు సులభతరం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. కార్డుల పంపిణీ సమయంలో లబ్ధిదారుల వివరాలను పూర్తిగా ధ్రువీకరించి, అర్హులైన వారికి మాత్రమే పారదర్శకంగా కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇక 2025 జనవరి 26 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 16,32,810 కొత్త ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. వీటి ద్వారా 61,08,544 మంది కొత్తగా ఆహార భద్రత పరిధిలోకి వచ్చినట్లు వెల్లడించారు.

ఆహార భద్రత కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ బియ్యం కోసం ఏడాదికి సుమారు రూ.14 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోందని చెప్పారు.

ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత ఆధునికంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading