“నమ్మకం” అనేది ఒకసారి కోల్పోతే మరొకసారి ఎవ్వరూ నమ్మరు… ఇప్పుడు BRS అగ్ర నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, తనని ఈ కేసు నుండి బయటికి పడవేసే మిత్రుడు కావాలి… కాని ఎక్కడా కానరావడం లేదు. ఎందుకు మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి… బాగాలేనప్పుడు విలువలు గురించి మాట్లాడకూడదు అని S/O సత్యమూర్తి అనే సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది… అలాగే మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక లాగ మాట్లాడి… అధికారంలో లేనప్పుడు మరోలా మాట్లాడతాను అంటే కుదరదు… రాజకీయాలలో.
దశ బాగున్నప్పుడు అంతా మనమే… అది శక్తి కోల్పోయి ప్రతికూలత ఏర్పడినప్పుడే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ లో తన పార్టీని కలిపేస్తానని ఢిల్లీలో మాట ఇచ్చి తర్వాత ఇక్కడకు వచ్చి మాట తప్పడం తో కాంగ్రెస్ అవకాశం కోసం చూసింది. రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది… అది సరే… మీరు రాజ్యాధికారం దళితుడు కి ఇస్తాను అని చెప్పినా… మాట తప్పి… మీరు ఇవ్వకపోయినా తెలంగాణ సమాజం మీకు ఎదురు మాట్లాడలేదు… ఎందుకంటే మీరంటే గౌరవం… కొట్లాడి తెచ్చిన తెలంగాణ అని… సరే రాజకీయంగా ఎవరి అవసరాలు వారికి ఉంటాయి… అది సరే.
కాని మీరు ఇప్పుడు భారత దేశ రాజకీయాలలో ఒంటరి… ఎందుకు ఈ దుస్థితి… ఎన్నికల ముందు తృతీయ ఫ్రంట్ అన్నారు…. చాలా రాష్ట్రాల్లో చాలా పార్టీలకు ఆర్థిక సహాయం చేశారు… మీ పాచిక పారలేదు. దానికి తగ్గట్టు మీ తనయురాలు డిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఇరుక్కోవడం మీకు చాలా గట్టి దెబ్బ రాజకీయంగా…. చంద్రబాబు ను ఓటు కు నోటు కేసుతో ఒడిసి పట్టుకున్నట్టుగా… బీజేపీ ముఖ్యనేత BL సంతోష్ ని కూడా అలాగే అజీజ్ నగర్ వ్యవహారంలో ఇరుకున పెట్టాలి అని చూసి… మిమ్మల్ని ఎవరూ నమ్మని స్థితిలోకి వెళ్ళిపోయారు… Bjp లో నమ్మక ద్రోహాన్ని క్షమించదు… మోదీ, షా ద్వయం… ఇప్పుడు కనుచూపు మేరలో ఎవరూ కాన రాక పామ్ హౌస్ కే పరిమితమయ్యారు.
కవిత విషయంలో మీరు ఎన్ని సంకేతాలు పంపిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు… మీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైపెచ్చు వాళ్ళు ఆడమన్నట్టుగానే ఇక్కడ కవిత కదలికలు ఉన్నాయి అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేసీఆర్ అంటే గొప్ప వక్త… కాని ఇప్పుడు మాట్లాడటానికి ఏ అంశం దొరకడంలేదు… చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడదాం అంటే… ఆయన మీరు విమర్శించే విమర్శలకు ఆయన స్పందనే లేకపోయే… ఇక భావోద్వేగాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు… ఇది మీకు తెలియనిది కాదు… మీకు ఏ అంశం దొరకడం లేదు.
ప్రధాని మోదీ పేరు… ప్రపంచమంతా మారుమోగుతోంది. ఆయనతో పెట్టుకోవడం అవివేకం అని ఆలోచించి “U టర్న్” బాబులు నితీష్ కుమార్, చంద్రబాబు లు పొత్తుపెట్టుకుని సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. తెలంగాణ లో ఉన్న 17 సీట్లతో, ప్రధాని పదవి కోసం మీరు తాపత్రయ పడటం వింతలలో కెల్ల వింత.
ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో SIT మీకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే… దేశ వ్యాప్తంగా మీరు చాలామందికి ఆర్థికంగా సహాయం చేశారు… కాని ఇప్పుడు మీకు బాసటగా నిలిచేవారు ఎవరు…? ముఖ్యమంతి రేవంత రెడ్డి కూడా మున్సిపల్ ఎన్నికల సమయంలో మీకు నోటీసులు అందించాడు… అంటే ఎలా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నాడో అర్ధం అవుతుంది. వెనకాల మాస్టర్ మైండ్స్ టీమ్ ఏదో చక్కగా ఎత్తులు వేస్తుంది.
మోడీ తో స్నేహం… నిజాయితీగా ఉంటే అందలం… లేకపోతే అధ:పాతాళం.