Download App

తెలంగాణ అభివృద్ధికి… ప్రధాని మోదీ భరోసా

మే 11, 2026 By Suresh Thota
తెలంగాణ అభివృద్ధికి మోదీ భరోసా ఇస్తూ ₹9,400 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం చేశారు. తెలంగాణ ప్రగతి పథంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రాష్ట్ర పర్యటనలో భాగంగా దాదాపు ₹9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు....
తెలంగాణ అభివృద్ధికి… ప్రధాని మోదీ భరోసా

తెలంగాణ అభివృద్ధికి మోదీ భరోసా ఇస్తూ ₹9,400 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం చేశారు. తెలంగాణ ప్రగతి పథంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రాష్ట్ర పర్యటనలో భాగంగా దాదాపు ₹9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ , రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా మరియు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కేంద్ర మంత్రులు జి . కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లో మౌలిక సదుపాయాలు, రవాణా మరియు పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారీ కేటాయింపులు చేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ముఖ్యమైన ప్రాజెక్టులు ఇవే…

దీనికి ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మేము, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పయనించాలని తెలంగాణ ఆకాంక్షిస్తోంది. తెలంగాణకు సంబంధించిన రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ – మచిలీపట్నం 12 వరుసల రహదారి వంటి ప్రతిపాదనలు మీ ముందుంచాం” అని ప్రధానమంత్రి గారికి గుర్తుచేశారు.

దేశ ఆర్థిక వృద్ధి మహానగరాల్లో వేగంగా జరుగుతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలను అభివృద్ధి చేస్తేనే దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని అన్నారు. దేశ అభివృద్ధి విషయంలో మేం మీతో కలిసి ఉన్నాం. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపాలని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని మీరు నిర్దేశించారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ నుంచి దేశ జీడీపీకి 10 శాతం వాటా అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రైజింగ్‌కు మీరు పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం మాకుంది” అని పేర్కొన్నారు.

అనంతరం ప్రధాని మోడీ… సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద ₹2,350 కోట్లతో నిర్మించనున్న ఇండస్ట్రియల్ ఏరియాకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది వేలాది మంది యువతకు ఉపాధిని కల్పించనుంది.

వరంగల్‌లోని పిఎం మిత్రా (PM MITRA) మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు.

హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా గూడెబెల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు (NH-167) జాతీయ రహదారి పనులకు అంకురార్పణ జరిగింది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

గచ్చిబౌలిలో అత్యాధునిక వసతులతో కూడిన 1,500 పడకల ‘సాయి సింధు’ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించారు. ₹1,535 కోట్ల రైల్వే పనులతో పాటు మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభించారు.

ప్రధాని మోదీ తెలంగాణ కు తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెబుతూ…. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డిజీ… నా మాట వింటున్నారా..? గతంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని మీరు గమనించాలి. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్ కేవలం వెయ్యి కోట్ల కంటే తక్కువగా ఉండేది. కానీ నేడు, కేవలం తెలంగాణ రాష్ట్రానికే బడ్జెట్‌లో ఏకంగా రూ. 5,500 కోట్లు కేటాయించాం” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 15 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. తాను తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ ముందు ఉంటానని భరోసా ఇచ్చారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading