మెగాబ్లాస్ట్ గ్లింప్స్‌తో విశ్వంభర ఒక మహత్తర విజువల్ స్పెక్టాకిల్‌ను ఆవిష్కరించింది. అద్భుతమైన సెట్‌లు, అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్, విశ్వాసం – ఫాంటసీ – సైంటిఫిక్ అంశాల కలయికతో డైరెక్టర్ వశిష్ట ఒక కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించారు.
మెగాస్టార్ చిరంజీవి శక్తివంతమైన ఎంట్రీతో గ్లింప్స్‌ను అలరించగా, త్రిషా, కునాల్ కపూర్, ఆశికా రంగనాథ్ పాత్రల తళుకులు కథలోని ప్రధాన మలుపులను సూచిస్తున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు, డ్రామాతో కూడిన విజువల్స్‌కు ఎం.ఎం. కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత జోష్ నింపింది.
యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం భారతీయ సంప్రదాయానికి, ఫాంటసీ అడ్వెంచర్‌కు, ఆధునిక టెక్నాలజీకి మేళవింపు అవుతుందని గ్లింప్స్ స్పష్టంగా చూపించింది.
