Download App

Universities:తెలంగాణలో యూనివర్సిటీలకు ఇంఛార్జ్‌ వీసీల నియామకం

మే 21, 2024 By Srinivas
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇంఛార్జ్ వీసీలుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇంఛార్జ్ వీసీల జాబితా ఇదే..ఉస్మానియా వర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా దాన కిషోర్జేఎన్‌టీయూ ఇంఛార్జ్ వీసీగా...

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇంఛార్జ్ వీసీలుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంఛార్జ్ వీసీల జాబితా ఇదే..

ఉస్మానియా వర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా దాన కిషోర్
జేఎన్‌టీయూ ఇంఛార్జ్ వీసీగా బుర్ర వెంకటేశం
తెలుగు వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా శైలజారామయ్యర్
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా రిజ్వి
కాకతీయ వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా వాకాటి కరుణ
తెలంగాణ వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా సందీప్ సుల్తానియా
మహాత్మాగాంధీ వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా నవీన్‌మిట్టల్
శాతవాహన వర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా సురేంద్రమోహన్
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ వర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా జయేష్‌ రంజన్
పాలమూరు వర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా నదీమ్‌ అహ్మద్

కాగా ఈ 10 యూనివర్సిటీల వీసీల పదవీకాలం ఇవాళ్టితో ముగియడంతో ప్రభుత్వంలో వివిధ శాఖాధిపతులుగా పనిచేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే కొత్త వీసీల కోసం అన్ని వర్శిటీలలో సెర్చ్‌ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ జాబితాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం వీసీలను నియమించనుంది. అప్పటివరకు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇంఛార్జ్ వీసీలుగా బాధ్యతల్లో కొనసాగనున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

మరిన్ని వార్తలు

No categories found.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading