Download App

‘రథ సప్తమి’ విశిష్టత… ఈ రోజున పూజ చేస్తే…

జనవరి 24, 2026 • By Suresh Thota
సనాతన ధర్మంలో సూర్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథి నాడు వచ్చే 'రథ సప్తమి'ని "సూర్య జయంతి"గా కూడా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణం వైపు పయనిస్తాడు. ఈ 2026 జనవరి 25న...
'రథ సప్తమి' విశిష్టత… ఈ రోజున పూజ చేస్తే…

సనాతన ధర్మంలో సూర్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథి నాడు వచ్చే ‘రథ సప్తమి’ని “సూర్య జయంతి”గా కూడా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణం వైపు పయనిస్తాడు. ఈ 2026 జనవరి 25న జరుపుకోనున్న ఈ పర్వదినానికి ఒక విశిష్టత ఉంది.

అది ఏమిటో చూద్దాం… సూర్యుడు ఆరోగ్య ప్రదాయకుడు. ఎవరికైనా ఆరోగ్యమే మహాభాగ్యం… అటువంటి సూర్య జయంతి నే… “రథ సప్తమి” అని అంటారు. ఆ రోజు సూర్యుడు ఉదయించే కాలంలో అంటే సూర్యుడు ఉదయించడానికి ముందు ఆకాశం ఎరుపు రంగులో ఉంటుంది… దానిని అరుణోదయం అని అంటారు… సూర్యుడు రథసారధి “అరుణుడు” కాబట్టి ఆ సమయాన్ని “అరుణోదయం” అని పిలుస్తారు. అప్పుడు నది స్నానం, లేదా సముద్ర స్నానం చేయాలి… జిల్లేడు ఆకులను నెత్తి మీద, భుజముల పైన, గుండెల మీద పెట్టుకొని..స్నానం ఆచరించాలి… అప్పుడు సూర్యుడికి “అర్ఘ్యం” సమర్పించి… అగస్త్య మహర్షి విరచితమైన ఆదిత్య హృదయం పఠించాలి. “త్రిచ విధాన పూర్వక సూర్య నమస్కారాలు” చేయాలి. ఆవు నేతితో దీపారాధన కావించి, ఆవు పిడకలు మీద పాలు, గోధుమలు, నెయ్యి తో తయారు చేసిన… పాయసాన్ని… (కలియ తిప్పడానికి చెఱకు ముక్కనే ఉపయోగించాలి)… చిక్కుడు ఆకులో… నైవేద్యం పెట్టి స్వామి వారికి నివేదించాలి.

దీని మూలంగా, రవి, రాహువు మరియు రవి, కేతువు కలయిక కలిగిన జాతకులకు దోషాలు తగ్గి… హార్ట్ ఎటాక్ జోన్ మరియు, చర్మ సంబంధిత, మూర్ఛ మొదలగు వ్యాధులు కలవారు ఈ రథ సప్తమి రోజున చేసే పూజల వలన స్వాంతన చేకూరుతుంది, అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

ఈ సంవత్సరం కాల పురుష చక్రంలో పదో స్థానంలో అంటే మకరంలో రవి, కుజ,బుధ,శుక్రులు ఉన్నారు. అన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇచ్చే విధంగా గ్రహాల స్థితి గతులు ఉన్నాయి అంటున్నారు. దీని ఫలితంగా చాలా మంది నాయకులకు గౌరవంతో కూడిన సత్కారాలు లభిస్తాయి. మహిళ లకు చక్కటి సంతానం కలుగుతుంది అని, ఈ రథ సప్తమి కి “అరుణ పారాయణం” లేదా “మహా సౌరం” తో కూడిన పూజ మరియు హోమాలలో పాల్గొంటే కీర్తి, యశస్సు, తేజస్సు…. కలుగుతుంది అని వేద పండితులు చెబుతున్నారు.

ప్రతి రాశిలోనూ ఒక నెల ఉంటాడు సూర్యుడు..ఒక రాశి లో 30 డిగ్రీలు… అలా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ప్రయాణిస్తాడు.. అలా 360 రోజులు ప్రయాణిస్తాడు..అంటే ఒక సంవత్సరం… దీనిని సూర్యుని రథానికి ఉన్న చక్రంగా భావిస్తారు…. ఇదే కాల చక్రం లేదా ధర్మ చక్రం అని అంటారు..

మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా, ‘ రథసప్తమి’ నుంచే ఉత్తరాయణం సంపూర్ణంగా ప్రారంభం అవుతుంది అంటారు…సూర్యుడు ఏడు గుర్రాలు పూన్చిన రథం పై పయనిస్తాడు…. దీనినే “సప్త అశ్వరథం” లేదా “చిత్ర రథం” అని అంటారు. ఈ రథానికి ఒక్కటే చక్రం ఉంటుంది. ఈ రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి. వాటి పేర్లు “గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి” వారంలోని ఏడు రోజులకు, సూర్యరశ్మిలోని ఏడు రంగులకు ఇవి ప్రతీకలు. ఆ రంగులు మానవుని శరీరంలో ఉండే ఏడు ధాతువులకి సూచిక గా భావిస్తారు… అవి మజ్జ, మాంసం, మేధస్సు, ఎముక, శుక్రం, శోణితం, చర్మం అనువాటిపై ప్రభావం కలిగివుంటాయి.

ఈ రోజు నుండి దక్షిణాయనం ముగించుకుని ఉత్తరాయణ దిశగా ప్రయాణం సాగిస్తాడు… మనం చేసే అన్ని కర్మలకు ఆయననే సాక్షి బూతంగా నిలుస్తాడు కాబట్టి, ఆయన్ని కర్మ సాక్షి అని అంటారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading