
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’ ఈ ఏడాది అత్యంత భారీ రిలీజ్‌లలో ఒకటిగా నిలుస్తోంది. అఖండ ఫ్రాంచైజ్‌కు ఉన్న అప్రతిహత క్రేజ్, బాలయ్య–బోయపాటి కాంబోపై ఉన్న ఆడియన్స్ నమ్మకం – రెండూ మాస్ ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికెత్తాయి.
మొదటి భాగమైన అఖండ కలెక్షన్ల పరంగా, అభిమానుల స్పందన పరంగా, మాస్ మేనియా పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో, సీక్వెల్‌పై మరింత భారీ ఆశలు పెరిగాయి.
బోయపాటి శ్రీను ఇప్పటికే మాస్, యాక్షన్ మరియు ఆధ్యాత్మికత కలయికను ఒక కొత్త పంథాలో చూపించిన దర్శకుడు. ‘అఖండ 2: తాండవం’లో ఆయన విజన్ మరోసారి పీకు స్థాయిలో ఉంటుందని టీజర్ , ట్రైలర్ స్పష్టంగా చూపించాయి.
సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సాంగ్స్ ఇప్పటికే సంచలన స్పందన పొందాయి. టీజర్ మరియు థీమ్ బీజీఎం మాస్ ఆడియన్స్ వారి అంచనాలను మరింత పెంచాయి.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
అఖండ 2 ప్రాజెక్టు ఎలా మొదలైంది?
లెజెండ్ సినిమా మేమే చేసాము. 2014 ఎలక్షన్స్ కి ముందు ఆ సినిమా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. అదే కాంబినేషన్లో మళ్లీ ఈ ఎలక్షన్స్ కి ముందు ఒక సినిమా చేయాలనుకున్నాం. మేము అనుకున్న కథ సరిగ్గా ఎలక్షన్స్ ముందే రావాలి. అప్పుడే ఆ క్యారెక్టర్, కథ కనెక్ట్ అవుతుంది. సరిగ్గా ఎలక్షన్ డేట్ అనేది ఒక క్లారిటీ లేకపోవడంతో ఆ కథని పక్కనపెట్టి అఖండ2 కథని ముందుకు తీసుకెళ్లాం.
బాలయ్య బాబు గారితో మళ్ళీ వర్క్ చేయడం ఎలా అనిపించింది.. అలాగే ఇది మీకు ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కదా ?
చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. బాలయ్య బాబు, బోయపాటిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వరసగా హ్యాట్రిక్ విజయాల తర్వాత మళ్లీ వస్తున్న సినిమా ఇది. ఈ కథ చాలా బిగ్ స్పాన్ ఉన్నది. బాలయ్య గారిలో అప్పటికి ఇప్పటికీ అదే ఎనర్జీ. ఇంకా పెరిగింది. ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన ఎనర్జీ మనకి వస్తుంది
ఈ సినిమాని చాలా డిఫరెంట్ లొకేషన్స్ లో సూట్ చేశారు కదా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు?
ఈ సినిమాని కుంభమేళాలో సూట్ చేసాం. అక్కడ షూట్ చేయాలంటే చాలా పర్మిషన్స్ కావాలి. మాకు అన్ని పర్మిషన్లు దొరికాయి. డ్రోన్ పర్మిషన్ కూడా దొరికింది. ఇప్పుడు మీరు సినిమాలో చూడబోయే ప్రతి సన్నివేశం ఈ సినిమా కోసం తీసిందే. స్టాక్ షాట్స్ ని ఉపయోగించలేదు. బోయపాటి అహర్నిశలు కష్టపడి కుంభమేళా సన్నివేశాలని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు.

ప్రీమియర్స్ వేసే ఆలోచనలో ఉన్నారా?
అవునండి. పర్మిషన్స్ కోసం లెటర్స్ పెట్టాం. అనుమతులు రాగానే ప్రీమియర్ డేట్స్ అనౌన్స్ చేస్తాం. నాలుగో తేదీ సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటల నుంచి ఉండొచ్చు. ఈ సినిమాకి టికెట్ రేట్స్ రీజనబుల్ గానే పెడుతున్నాం.
ఈ సినిమాని మొదటనుంచి పాన్ ఇండియా రిలీజ్ అనుకున్నారా
అవునండి. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు నుంచి దేశం మొత్తం రిలీజ్ చేయాలని భావించాం. అయితే పాన్ ఇండియా కోసమంటూ ప్రత్యేకంగా కథలో చేసిన మార్పులంటూ ఏమీ లేవు. ఇది పాన్ ఇండియా కంటెంట్. ఈ సినిమా కథ గ్లోబల్ గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సినిమాల్లో చాలా గూజ్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. బాలయ్య బోయపాటి గారి నుంచి ఏమి ఆశిస్తారో అంతకుమించి ఉంటుంది. సినిమా చూశాం. అదిరిపోయింది.
ఈ సినిమా కథ వినగానే త్రీడీలో బాగుంటుందనుకున్నాం. రేపు త్రీడీ సెన్సార్ ఉంటుంది. 2D, 3D రెండూ ఒకేసారి రిలీజ్ వుంటుంది.
ఫస్ట్ టైం నందమూరి తేజస్విని ఈ సినిమాకి ప్రజెంటర్ గా ఉన్నారు కదా.. ఈ ప్రాజెక్టులో వారి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది?
తేజస్విని ప్రమోషన్ కి సంబంధించి మంచి సజెషన్స్ ఇస్తుంటారు. అలాగే ప్రొడక్షన్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేయాలని అనుకుంటున్నారు. అది అఖండ2 తో మొదలు పెడితే బాగుంటుందని భావించారు.
అఖండతో పోలిస్తే ఈ చిత్రానికి యాక్షన్ డోస్ పెరిగినట్లుగా అనిపిస్తుంది?
శివుడంటే మాస్ కదా.. శివతాండవం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇందులో యాక్షన్ కూడా అలానే ఉంటుంది. ఇందులో త్రిశూలం వాడినట్లుగా మరో సినిమాలో వాడలేరు.
ఈ సినిమా క్లైమాక్స్ అంతా జార్జియాలో చేశాం. నిజానికి కాశ్మీర్లో చేయాల్సింది కానీ అదే సమయంలో పెహెల్గాం దాడి జరగడంతో పర్మిషన్స్ ఇష్యూ వచ్చింది. జార్జియాలో మైనస్ డిగ్రీ చలిలో షూట్ చేశాము. మేమందరం చలిలో స్వెటర్లు వేసుకున్నాం. కానీ బాలయ్య గారు అఘోర గెటప్ లో స్లీవ్ లెస్ లో అలా చలిలోనే అద్భుతంగా నటించారు. ఆయన కాబట్టి చేశారు. మరొకరు అయితే అంత చలిలో అలాంటి యాక్షన్ చేయడం అసాధ్యం.
సంయుక్త, పూర్ణ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి?
సంయుక్త హీరోయిన్ క్యారెక్టర్ లా కాకుండా ఈ కథలో ఒక ముఖ్యమైన పాత్రలానే వుంటుంది. అఖండ లో ఉన్న పూర్ణ ఇందులో కూడా కంటిన్యూ అవుతారు.
బోయపాటితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
బోయపాటిలో ఒక గొప్ప లక్షణం ఉంది. ఆయన ఏది చెప్పినా వింటారు. ఆ కథకి ప్రాజెక్టుకి అవసరమైన సూచన సలహా అయితే వెంటనే నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరణలో పెడతారు.
ఈ సినిమా అంతా సనాతన ధర్మం చుట్టూ తిరుగుతుందని అంటున్నారు.. ఇలాంటి సమయంలో ఈ కథ రావడం ఎలా అనిపిస్తుంది?
అదే మా సినిమా యుఎస్పి అనుకుంటున్నాం. ఇందులో సనాతన ధర్మం ఉంటుంది. దానితోపాటు నమ్మ,కం భక్తి మీద నడిచే కథ ఇది. అఖండ సినిమాలోనే చిన్న పిల్లలు, దేవాలయాల జోలికి వస్తే ఆ పరమశివుడే వస్తాడని రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగానే ఈ సినిమా ఉంటుంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి మీరు ఈ కంటెంట్ చూపించారు కదా.. ఆయన రియాక్షన్ ఏమిటి?
ఆయన చాలా బాగుంది అన్నారు. అద్భుతమైన కంటెంట్ అని అభినందించారు.

తమన్ మ్యూజిక్ గురించి?
ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జ్యూక్ బాక్స్ ని కూడా రిలీజ్ చేశాం. ఇంకాస్త ముందుగా రిలీజ్ చేస్తే బావుండేదని ఆడియన్స్ చెప్తున్నారు. ఇందులో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాటలు కూడా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోరు నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ సినిమా సిజి వర్క్ కూడా చాలా మంచి అప్లోడ్ చేస్తుంది?
మ్యాట్రిక్స్ కంపెనీ నరేంద్ర వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది. అఖండ 2 ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. వీలైతే త్రీడీలో చూడండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది
అఖండ3 చేసే అవకాశం ఉందా?
ఈ యూనివర్స్ లో మరో సినిమా చేసే స్కోప్ అయితే ఉంది. అది లిమిట్ లెస్. బాలయ్య, బోయపాటి అనుకుంటే ఏదైనా అవ్వచ్చు. ఇందులో మేము మొదలు పెట్టిన కథ అయితే సంపూర్ణంగా పూర్తవుతుంది.
ఆది పినిశెట్టి గురించి?
ఆది అద్భుతమైన పెర్ఫార్మర్. ఇందులో ఆయన క్యారెక్టర్ చాలా చక్కగా వచ్చింది. ఆయన క్యారెక్టర్ కి 200% జస్టిఫికేషన్ చేశారు.
ఈ చిత్రాన్ని ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు?
అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నాం. అలాగే హిందీలో చేస్తున్నాం. ఇది కాకుండా బీహార్ లో అవధి అనే ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ భాషలో కూడా రిలీజ్ చేస్తున్నాం
