Download App

రేసింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా మిళితమైన సినిమా “బైకర్” – జిబ్రాన్

మార్చి 16, 2026 By Srinivas
చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా “బైకర్”. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారతదేశంలో రూపొందుతున్న మొదటి పూర్తి స్థాయి...
రేసింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా మిళితమైన సినిమా “బైకర్” – జిబ్రాన్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా “బైకర్”. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారతదేశంలో రూపొందుతున్న మొదటి పూర్తి స్థాయి మోటోక్రాస్ డ్రామాగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ గ్లింప్స్, మొదటి రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు?

“సాహో తర్వాత ఒక మంచి కమ్‌బ్యాక్ ఫిలిం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సమయంలో యూవీ క్రియేషన్స్‌కు చెందిన వంశీ గారు ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. తర్వాత దర్శకుడు అభిలాష్ గారిని కలిశాను. ఆయనతో మాట్లాడినప్పుడు చాలా విషయాల్లో మా ఆలోచనలు కలిసిపోయాయి. ఆయన కథ చెప్పినప్పుడు ఇది నాకు మంచి కమ్‌బ్యాక్ సినిమా అవుతుందని అనిపించింది. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది, ముఖ్యంగా ఎమోషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

శర్వానంద్ గారి రన్ రాజా రన్ సినిమాతోనే నేను తెలుగు ప్రేక్షకులకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాను. ఇప్పుడు మళ్లీ ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు మంచి కమ్‌బ్యాక్ ఇస్తుందని నమ్ముతున్నాను.”

రేసింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా మిళితమైన సినిమా “బైకర్” – జిబ్రాన్

రేసింగ్ సినిమాలు తెలుగులో అరుదు… మేకింగ్ ఎలా ఉంటుంది?

“ఈ సినిమా మేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది. దర్శకుడు అభిలాష్ గారి ఆలోచన కూడా అదే. ఇందులో కేవలం రేసింగ్, యాక్షన్ మాత్రమే కాదు, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి.

ఒక క్రీడాకారుడైనా, రేసర్ అయినా అతనికి ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఉండే భావోద్వేగాలను ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు. రేసింగ్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా మిళితమయ్యాయి.”

ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఏమి బాగా నచ్చింది?

“సినిమా మొత్తం అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాలు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ అనుభూతిని ఇస్తాయి. బైక్ రేసింగ్ గురించి పెద్దగా తెలియని వారికి కూడా ఇందులో చూపించిన రేసింగ్ చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది.

అలాగే తండ్రి–కొడుకు మధ్య ఉండే ఎమోషన్ కూడా చాలా బలంగా ఉంటుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఖచ్చితంగా ఇష్టపడతారు.”

ఈ జోనర్ సినిమాకి మ్యూజిక్ చేయడంలో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి?

“రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలను చాలామంది హాలీవుడ్ సినిమాలతో పోల్చుతారు. ఎక్కడికి వెళ్లినా F1 లాంటి మ్యూజిక్ చేయమని అడుగుతారు. నిజానికి మేము ఈ సినిమా ప్రారంభించినప్పుడు F1 ఇంకా విడుదల కాలేదు. కానీ మా సినిమాకి సరిపోయేలా బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నించాం. ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను.”

సౌండ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

“రేసింగ్ సన్నివేశాల్లో బైక్స్ నుంచి వచ్చే సౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సౌండ్స్ వల్ల మ్యూజిక్ వినిపించకుండా పోకూడదు. అందుకే కొత్త టెక్నాలజీ ఉపయోగించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ సమతుల్యంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం.”

రేసింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతంగా మిళితమైన సినిమా “బైకర్” – జిబ్రాన్

శర్వానంద్ పర్ఫార్మెన్స్ గురించి?

“ఈ సినిమా చూసిన తర్వాత శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. ఆయనకు చాలా మంచి పేరు వస్తుంది. మ్యూజిక్ చేస్తున్నప్పుడు నాకు ఒక కొత్త శర్వానంద్ కనిపించారు. ఈ సినిమా ఆయనకు గొప్ప పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను.”

దర్శకుడు అభిలాష్ గురించి?

“అభిలాష్ చాలా క్రమశిక్షణ గల దర్శకుడు. ఆయన దృష్టి ఎప్పుడూ సినిమాపైనే ఉంటుంది. ఈ సినిమాలో మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి. అందులో ఒకటి పూర్తి పాటగా ఉంటుంది, మిగతావి మాంటేజ్ సాంగ్స్. మ్యూజిక్ విషయంలో ఆయనకు మంచి క్లారిటీ ఉంది. ఎలాంటి మ్యూజిక్ కావాలో స్పష్టంగా చెబుతారు. ఆయన భవిష్యత్తులో తెలుగు పరిశ్రమలో మంచి దర్శకుడిగా నిలుస్తారని నమ్ముతున్నాను.”

యూవీ క్రియేషన్స్ గురించి?

“వంశీ గారు నాకు ఒక బ్రదర్‌లా ఉంటారు. ఆయనకు నా మ్యూజిక్‌పై మంచి నమ్మకం ఉంది. మేము కలిసి చేసిన రన్ రాజా రన్, జిల్, సాహో సినిమాల్లో మ్యూజిక్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా సాహో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందరికీ చాలా నచ్చింది. వంశీ గారు ఎప్పుడూ నాకు సపోర్ట్ ఇస్తారు. ఆయన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ‘బైకర్’ సినిమాలో ప్రేక్షకులు నా నుంచి కొత్త మ్యూజిక్ వింటారు.”

ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు?

“ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం తెలుగులో బైకర్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో లీడర్ అనే సినిమా చేశాను. అది కూడా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.”

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading