Download App

₹761 కోట్లు ఓపెనింగ్ వీకెండ్: ‘ధురంధర్ ది రివెంజ్’ బాక్సాఫీస్ సంచలనం

మార్చి 24, 2026 By Srinivas
జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ రివెంజ్’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన మొదటి వీకెండ్‌లోనే ఈ చిత్రం బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తూ ఆల్‌టైమ్ గ్లోబల్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అసాధారణమైన అడ్వాన్స్ బుకింగ్‌లు, అన్ని సర్క్యూట్‌లలో...
‘ధురంధర్: ది రివెంజ్’ ట్రైలర్: రణవీర్ సింగ్ డబుల్ రోల్ హైలైట్

జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ రివెంజ్’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన మొదటి వీకెండ్‌లోనే ఈ చిత్రం బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తూ ఆల్‌టైమ్ గ్లోబల్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

అసాధారణమైన అడ్వాన్స్ బుకింగ్‌లు, అన్ని సర్క్యూట్‌లలో హౌస్‌ఫుల్ షోలు, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం దేశీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా కొత్త మైలురాయిని సెట్ చేసింది.

మొదటి రోజు నుంచి మాస్ రెస్పాన్స్ దక్కించుకున్న ఈ మూవీ, అత్యధిక పెయిడ్ ప్రివ్యూలు, అతిపెద్ద ఓపెనింగ్ డే, అతిపెద్ద శనివారం, అతిపెద్ద ఆదివారం వంటి పలు రికార్డులను సొంతం చేసుకుంది. హిందీ చిత్రాల్లో బిగ్గెస్ట్ గ్లోబల్ హిట్‌గా నిలిచిన ఈ ఫ్రాంచైజీ, ఈ సీక్వెల్‌తో మరింత ఎత్తుకు చేరింది.

కేవలం ఓపెనింగ్ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ₹761 కోట్ల భారీ వసూళ్లు రాబట్టిన ‘ధురంధర్ రివెంజ్’, భారతీయ సినిమాకు గ్లోబల్ స్థాయిలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. ఈ విజయంతో, ఇండియన్ సినిమా మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading