
బాలీవుడ్ స్టార్ Ranveer Singh హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ధురంధర్ 2 పై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఉగాది–ఈద్ కానుకగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ముందుగానే ప్రీమియర్ షోస్ ప్లాన్ చేసి బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో షోలు ఏర్పాటు చేయగా, వాటిలో చాలా వరకు టికెట్లు అమ్ముడైనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే విడుదలకు గంటల ముందు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇండియా వైడ్‌గా తెలుగు వెర్షన్ ప్రీమియర్ షోస్ రద్దు అయినట్టు సమాచారం వెలువడుతోంది. దీనికి ప్రధాన కారణంగా కంటెంట్ డెలివరీ ఆలస్యం జరిగినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే బుక్ చేసిన ప్రేక్షకులకు ప్రీమియర్ షోస్ రద్దు చేసినట్టు మెసేజ్‌లు కూడా వస్తున్నట్లు తెలిసింది. దీంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసిన తెలుగు ఆడియెన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో భారీగా ప్లాన్ చేసిన ఈ విడుదలలో ఇలాంటి అంతరాయం రావడం సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
