జూన్ 20 న థియేటర్లలో విడుదలైన ‘8 వసంతాలు’ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణను కూడా అందుకుంది. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మెల్లగా విడుదలై మంచి మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుంది. ఇందులో ‘MAD’ ఫేమ్ బ్యూటీ అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు.
థియేటర్లలో విజయవంతంగా నడిచిన ఈ సినిమా ఇప్పుడు తక్కువ వ్యవధిలోనే ఓటీటీ వేదికపై ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని జూలై 11వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించగా, పాటలు కథకు మంచి బలం చేకూర్చాయి. అలాగే హను రెడ్డి, కన్నా పసునూరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ప్రేమ, సంబంధాల మధ్య ప్రయాణించే ఈ భావోద్వేగ కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో, ఓటీటీలో విడుదలైన తర్వాత తెలుస్తుంది.