బాక్సాఫీస్ వద్ద బోల్తా.. కానీ.. గూగుల్ ట్రెండ్స్ 2025లో టాప్
December 12, 2025 Published by Rahul N

2025లో గూగుల్ ఇండియా ట్రెండింగ్ మూవీస్ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక తెలుగు చిత్రం రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ రాజకీయ యాక్షన్ డ్రామా, బాక్సాఫీస్‌లో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఆన్‌లైన్‌లో మాత్రం భారీగా సెర్చ్ చేసారు.
విడుదలకు ముందు నుండే సినిమాను చుట్టుముట్టిన భారీ హైప్, శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్‌పై ఉన్న ఆసక్తి, సోషల్ మీడియాలో అనేక హాట్ టాపిక్‌లకు కారణమయ్యాయి. దీని ప్రభావం గూగుల్ సెర్చ్‌లలో స్పష్టంగా కన్పించింది. విడుదలకు ముందు మరియు తర్వాత కూడా గేమ్ ఛేంజర్ పదే పదే ట్రెండింగ్‌లో నిలిచి, 2025 టాప్ టెన్ లిస్ట్‌లో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది.
సినిమా ఫలితంపై మిశ్రమ అభిప్రాయాలు వచ్చినప్పటికీ, రామ్ చరణ్ పోషించిన పాత్ర, శంకర్ విజన్, సాంగ్స్, యాక్షన్ సెట్పీసులు ఆన్‌లైన్ ప్రేక్షకులను ఆకర్షించాయి. దీని వల్లే గేమ్ ఛేంజర్ సంవత్సరం మొత్తం గూగుల్‌లో ప్రధాన చర్చావిషయంగా నిలిచింది.
2025లో భారతీయ సినిమాల మధ్య పెద్ద పోటీ నడిచినా, ప్రపంచస్థాయి దృష్టిని ఆకర్షించిన ఈ ప్రాజెక్ట్ గూగుల్ ట్రెండ్స్‌లో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
2025 గూగుల్ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ మూవీస్
- Saiyaara
- Kantara: A Legend Chapter-1 (Kannada)
- Coolie (Tamil)
- War 2
- Sanam Teri Kasam
- Marco (Malayalam)
- Housefull 5
- Game Changer (Telugu)
- Mrs.
- Mahavatar Narsimha
