Download App

‘దురంధర్’ ఎందుకు చూడాలంటే….?

డిసెంబర్ 19, 2025 By Srinivas
కొన్ని చిత్రాలు చూసిన తరువాత వెంటాడుతూ ఉంటాయి. అలాంటి చిత్రాల్లో ' దురంధర్ ' ఒకటి… దేశం కోసం ఆలోచించే ఆఫీసర్స్ , నిజాయితీ తో కూడిన ఆఫీసర్ లు ఉంటే దేశం ఎలా ఉంటుందో తెలియచెప్పే చిత్రం ఈ దురంధర్. ఆదిత్య ధర్ దర్శకత్వం అద్భుతః…. ధురంధర్...
'దురంధర్' ఎందుకు చూడాలంటే….?

కొన్ని చిత్రాలు చూసిన తరువాత వెంటాడుతూ ఉంటాయి. అలాంటి చిత్రాల్లో ‘ దురంధర్ ‘ ఒకటి…

దేశం కోసం ఆలోచించే ఆఫీసర్స్ , నిజాయితీ తో కూడిన ఆఫీసర్ లు ఉంటే దేశం ఎలా ఉంటుందో తెలియచెప్పే చిత్రం ఈ దురంధర్. ఆదిత్య ధర్ దర్శకత్వం అద్భుతః….

ధురంధర్ సినిమా జీయో స్టూడియోస్ (Jio Studios) మరియు బీ62 స్టూడియోస్ కలసి సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాతలు జ్యోతి దేశ్‌పాండే ,లోకేష్ ధర్ , ఆదిత్య ధర్. నటీనటులు గా… రణ్ వీర్ సింగ్,అక్షయ ఖన్నా, సంజయ్ దత్త్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ ,రాకేష్ బేడీ మొదలైన వారు నటించారు.

మూడున్నర గంటల నిడివి ఉన్న ఈ చిత్రం 1999 లో జరిగిన కాంధహర్ విమానం హైజాక్ తో మొదలవుతుంది. అప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో NDA ప్రభుత్వం నడుస్తుంది. అప్పుడు మనం విడిచిపెట్టిన ఉగ్రవాదులు ముగ్గురు.

1)మౌలానా మసూద్ అజార్ (జైష్-ఎ-మహమ్మద్ )
2) అహ్మద్ ఒమర్ సయీద్ షేక్
3)ముష్తాక్ అహ్మద్ జర్గర్.

ఈ సినిమాని 6 చాప్టర్ లుగా చూపిస్తారు. కొన్ని సినిమాటిక్ సీన్స్ నీ పక్కన పెడితే అప్పటి రాజకీయ నాయకుల అవినీతి, ఫలితంగా మనదేశం మీద ఆధారపడి పడి బ్రతికేసిన పాకిస్తాన్ ను చాలా అద్భుతంగా చూపించారు.

'దురంధర్' ఎందుకు చూడాలంటే….?

ఒక బాధ్యత కలిగిన పదవి లో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు మూలంగా మనదేశం సిన్సియర్ RAW ఆఫీసర్ నీ కోల్పోయింది. పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కు సంబంధించిన విషయం లో… అవి ఈ మూవీ లో చూపించలేదు బహుశా పార్ట్ 2 లో చూపించవచ్చు.

మనదేశ కరెన్సీ కి చెందిన ఒరిజినల్ ప్లేట్స్ ను, మన దేశ నాయకులే పాకిస్తాన్ కు అందించిన విషయం సినిమా చూస్తుంటే నే వొళ్ళు జలదరిస్తుంది. ఇంత స్వార్ధ పరులైన నాయకులు ఉండబట్టే మనం కులాల కురుక్షేత్రం లో తగలబడిపోతు ఉంటే వాళ్ళు చలి కాచుకుంటున్నారు. ఎప్పుడూ “కోట తలుపులు లోపలి నుండే తెరవబడతాయి” అని నానుడి ఉండనే ఉంది.

IB ఆఫీసర్ మాధవన్(అజిత్ దోబల్) చేత ఒక డైలాగ్ చెప్పించారు. ఇప్పుడు మనం ఏమి చేయలేము ఏది చేసినా అది ఆత్మహత్య శదృశ్యమే అవుతుంది…. తొందరలోనే మన మాట చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం వస్తుంది అప్పుడు చూద్దాం అని చెప్పిస్తారు. అంటే ఈ విషయం మీద అప్పుడే అజిత్ దోభాల్ కి ఒక ఐడియా ఉంది. దీని మీద అప్పట్లోనే మోడీ తో చర్చించారా అనే ప్రశ్న… ప్రేక్షకుడికి తలెత్తుతుంది.

ముంబై లో కసబ్ బృందం దాడుల నేపధ్యంలో …. ఉగ్ర బృందానికి పాకిస్తాన్ నుండి ఇండియన్ చానల్స్ చూస్తూ…. వాళ్ళకి ఇచ్చే సూచనలు చూస్తే …..మన మీడియా కి చెంపపెట్టు లాంటిది…. ఆలోచించే వాళ్ళకి…. మన మీడియా బాత్రూమ్ లో శవాలు ఎలా పడి ఉన్నాయో…. వీళ్ళు కూడా అలానే చేసి నవ్వులు పాలయిన సందర్భాలు ఉన్నాయి కదా….. అవి మన మీడియా పట్టించుకోదు కాబట్టి ఒకే.

ఇలా చాలా చక్కగా చూపించారు….. కాని ఇంకా వివరంగా చూపించొచ్చు…. ఉగ్ర ముఠా పాకిస్తాన్ నుండి ముంబై కి వచ్చినప్పుడు ఎలా వచ్చింది అన్నది… ఇంకాస్త వివరంగా చెప్పి ఉంటే బాగుండేది.

ముంబై వరుస పేలుళ్ల నేపధ్యంలో ప్రధాన నిందితుడు …. దావూద్ ఇబ్రహీం గురించి పార్ట్ 2 లో ఉండొచ్చు అంటున్నాయి….. ముంబై మీడియా వర్గాలు… చూసిన నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ చిత్రం గురించి పాజిటివ్ రివ్యూ లు ఇస్తున్నారు….. అందులో….. కొందరు…. 2014 లో మన RAW కి బుల్లెట్ దూరంలో ఉన్న దావూద్ ఇబ్రహీం ని షూట్ చేయకుండా ఆపిన అదృశ్య శక్తిని కూడా చూపిస్తే బాగుంటుంది అంటున్నారు.

మన RAW ఆఫీసర్స్ మధ్య ప్రాచ్యం లో తుడిచిపెట్టుకు పోవడానికి కారణమై…. తదనంతర కాలంలో మనకు ఉప రాష్ట్రపతి గా నియమించబడ్డ వ్యక్తి గురించి కూడా పార్ట్ 2 లో చూపిస్తే బాగుంటుంది అంటున్నారు. సోషల్ మీడియాలో.

ఇవన్నీ ప్రజలకు తెలియాలి. ముఖ్యంగా యువత తెలుసుకోవాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది..సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటారు. ఈ చిత్రాన్ని యువత చాలా బాగా చూస్తున్నారు. అందుకే 500 కోట్లు దాటాయి ఈ సినిమా కలెక్షన్లు.

“దురంధర్”

“సినిమా బాగుంటే జాకీలు పెట్టీ ఎత్తవలసిన పని లేదు” మౌత్ పబ్లిసిటీ తో వెళుతుంది అనడానికి ఈ చిత్రమే నిదర్శనం.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading