సినిమా వార్తలు

150 మిలియన్ వ్యూస్‌తో సంచలనం: ‘చికిరి చికిరి’తో రామ్ చరణ్ గ్లోబల్ ట్రెండ్

Published by
Srinivas

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన స్టార్ పవర్‌కు సరికొత్త అర్థం చెప్పారు. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ సంచలనంగా మారింది. విడుదలైన క్షణం నుంచి ఈ పాట సోషల్ మీడియా, మ్యూజిక్ ప్లాట్‌ఫాంలను ఊపేస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది.

విడుదలైన కేవలం నెల రోజుల్లోనే, ఒక్క తెలుగు వెర్షన్‌లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను దాటిన ‘చికిరి చికిరి’, ఐదు భాషల్లో కలిపి 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. రోజురోజుకూ పెరుగుతున్న వ్యూస్, షేర్లు, రీల్స్‌తో ఈ పాట క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు.

లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పవర్‌ఫుల్ బీట్స్, క్యాచీ రిథమ్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రామ్ చరణ్ చూపించిన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్, మెగా స్థాయి స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి. రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్, సెలబ్రిటీ షేర్లతో ‘చికిరి చికిరి’ ఒక గ్లోబల్ మ్యూజిక్ ఫీనామెనాన్‌గా నిలుస్తోంది.

దర్శకుడు బుచ్చిబాబు సన ఈ పాటను అత్యంత స్టైలిష్‌గా, గ్రాండ్ విజువల్స్‌తో తీర్చిదిద్దారు. ప్రతి ఫ్రేమ్‌లో కనిపించే భారీ నిర్మాణ విలువలు, విజువల్ రిచ్‌నెస్ ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘చికిరి చికిరి’ సృష్టిస్తున్న రికార్డులు, పెరుగుతున్న హైప్‌తో ‘పెద్ది’పై ప్రీ-రిలీజ్ బజ్ ఇప్పుడు పీక్ స్థాయికి చేరిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా విడుదలకు ముందే ఇలాంటి క్రేజ్ రావడం, ‘పెద్ది’ను భారీ అంచనాలతో ఎదురుచూసే స్థాయికి తీసుకెళ్లింది.

Srinivas