నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రత్యేకమైన ఎనర్జీ, పవర్‌ప్యాక్‌డ్ యాక్షన్‌కు పరమాయుధం. ఇప్పుడు అదే జంట మరోసారి ‘అఖండ 2: తాండవం’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ఫస్ట్ సింగిల్ ‘తాండవం’ ప్రేక్షకులను ముగ్ధులను చేస్తూ సినిమాపై మాస్ హైప్‌ను మరింత పెంచాయి.
ఈ వేడిలోనే మేకర్స్ మరో పెద్ద అప్‌డేట్‌ను విడుదల చేశారు. ‘అఖండ 2’ సెకండ్ సింగిల్ ‘జాజికాయ’ను నవంబర్ 18న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పాట పక్కా డ్యాన్స్ నెంబర్‌గా, థియేటర్లలో ఎనర్జీని పెంచేలా కంపోజర్ తమన్ అద్భుతంగా రూపొందించినట్టు తెలుస్తోంది. భారీ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటలో బాలకృష్ణ చూపించిన మాస్ డ్యాన్స్ స్టెప్స్ ఫ్యాన్స్‌ను పూర్తిగా అలరించబోతున్నాయని టీమ్ చెబుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో బాలయ్య స్టైల్, ఎనర్జీ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.
వైజాగ్ జగదాంబ థియేటర్‌లో నిర్వహించనున్న ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానుండటం విశేషం. సినిమాలో ఆది పినిశెట్టి ఒక బలమైన పాత్రలో కనిపించబోతుండగా, ‘బజరంగీ భాయిజాన్’ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. సినిమాటోగ్రఫీని సి. రాంప్రసాద్, సంతోష్ D Detakae కలిసి నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలను తమ్మిరాజు చూసుకుంటున్నారు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు.
అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘అఖండ 2: తాండవం’ 2D మరియు 3D రెండింట్లోను 2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.