
అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన భార్య జైనబ్ రవ్‌డ్జీతో కలిసి జపాన్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వెకేషన్‌కు సంబంధించిన కొన్ని అందమైన ఫొటోలను అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. “Fuji – san” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జపాన్‌లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ అయిన మౌంట్ ఫుజి అందాలు కనిపించే ఓ లగ్జరీ రిసార్ట్‌లో ఈ జంట తమ సమయాన్ని గడుపుతున్నారు. సాధారణంగా అఖిల్ తన వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి తర్వాత భార్యతో కలిసి వెళ్లిన హాలిడేకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ ఫొటోల్లో అఖిల్ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఉదయపు సూర్యకాంతిని ఆస్వాదిస్తూ, రిసార్ట్ బాల్కనీలో కూర్చుని మౌంట్ ఫుజి అందాలను చూస్తూ బ్రేక్‌ఫాస్ట్, టీ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు రిసార్ట్ సమీపంలోని నీటి ప్రవాహం దగ్గర జైనబ్‌తో కలిసి గడిపిన క్షణాలను కూడా ఈ ఫొటోల్లో చూడొచ్చు.
ఇక ఈ ఫొటో సిరీస్‌లో చివరగా ఉన్న సెల్ఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అఖిల్ సెల్ఫీ తీసుకుంటుండగా జైనబ్ ఆయన చెంపపై ముద్దు పెడుతున్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ మూమెంట్‌తో ఈ వెకేషన్ ఆల్బమ్‌కు మరింత ప్రత్యేకత వచ్చింది.

అఖిల్, జైనబ్‌ల వివాహం 2025 జూన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పెద్దగా సోషల్ మీడియాలో పంచుకోని ఈ జంట, ఇప్పుడు ఇలా వెకేషన్ ఫొటోలతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది లెనిన్ సినిమాతో అఖిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌పై అఖిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఆయన కొత్త సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
