Download App

అల్లు అర్జున్ మరియు Jr. ఎన్టీఆర్ లతో ‘ధురంధర్’ డైరెక్టర్ సినిమా…?

ఫిబ్రవరి 17, 2026 By Suresh Thota
ధురంధర్ మూవీతో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య ధర్… ఈయన దర్శకత్వంలో అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ కథానాయకులుగా పాన్ ఇండియా మూవీ రూపుదిద్దుకోబోతుంది అని ట్రేడ్ వర్గాలు లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి ముందు అడుగు వేసింది అల్లుఅర్జున్… అల్లు...

ధురంధర్ మూవీతో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య ధర్… ఈయన దర్శకత్వంలో అల్లు అర్జున్ మరియు ఎన్టీఆర్ కథానాయకులుగా పాన్ ఇండియా మూవీ రూపుదిద్దుకోబోతుంది అని ట్రేడ్ వర్గాలు లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

దీనికి ముందు అడుగు వేసింది అల్లుఅర్జున్… అల్లు అర్జున్ కి ఒక అలవాటు ఉంది దేశంలో, భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా హిట్ అయినా ఆ దర్శకునికి అభినందనలు తెలుపుతూ గ్రీటింగ్స్ పంపిస్తారు… అందులో భాగంగానే దురంధర్ హిట్ టాక్ రావడంతో… ఆదిత్య ధర్ కి ఒక స్వీట్ బాక్స్ మరియు పూలబొకే పంపించారు.

అల్లు అర్జున్ మరియు Jr. ఎన్టీఆర్ లతో దురంధర్ డైరెక్టర్ సినిమా...?

దీనికి ఆదిత్యధర్ ప్రతిస్పందన గా అల్లు అర్జున్ తో మాట్లాడటం జరిగింది అని… ఆ మాటలలో తదుపరి చిత్రం గురించి వచ్చిన ప్రస్తావన లో… ఆయన చెప్పిన లైన్ నచ్చడంతో… ముందడుగు పడ్డట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి మరొక క్యారెక్టర్ ఎన్టీఆర్ పోషింకాబోతున్నట్లుగా పరిశ్రమ వర్గాల బోగట్టా…..? తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తున్న ఒక పెద్ద బ్యానర్ తో పాటు… హిందీలో పేరు గాంచిన ఒక ప్రొడక్షన్ హౌస్ ను ఆదిత్య ధర్ సజెస్ట్ చేసినట్లుగా ఫిలింనగర్ లో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం ఆ తెలుగు నిర్మాత వారం రోజుల నుండి ముంబై లోనే ఉన్నారట… ఇది నిజమైతే(ప్రస్తుతానికి నిజమే)ఖచ్చితంగా అల్లు అర్జున్ మరియు Jr. ఎన్టీఆర్ అభిమానులకు జోష్ పెంచే వార్త అవుతుంది. దురంధర్ తోనే ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆదిత్యధర్, రాబోయే ఈ చిత్రం తో ఏమేరకు, ఏ స్థాయిలో హిట్ కొడతాడో అని ఏ ఇద్దరు నిర్మాతలు కలుసుకున్న ఇదే మాట మాట్లాడుకుంటున్నారు అట.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading