Download App

‘ఈశ్వర్’ నుంచి పాన్ వరల్డ్ స్టార్ వరకు.. ప్రభాస్ సినీ ప్రయాణానికి 24 ఏళ్లు!

నవంబర్ 11, 2026 • By Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ సినీ ప్రస్థానం 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2002 నవంబర్ 11న విడుదలైన ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వేడుకలు...
‘ఈశ్వర్’ నుంచి పాన్ వరల్డ్ స్టార్ వరకు.. ప్రభాస్ సినీ ప్రయాణానికి 24 ఏళ్లు!

రెబల్ స్టార్ ప్రభాస్ సినీ ప్రస్థానం 24 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2002 నవంబర్ 11న విడుదలైన ‘ఈశ్వర్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఆయన.. నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వేడుకలు చేసుకుంటున్నారు. #Prabhas24Years హ్యాష్‌ట్యాగ్‌తో ప్రత్యేక పోస్టర్లు, డీపీలు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ప్రారంభంలో వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కు ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత ఆయన మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. భారీ బడ్జెట్ చిత్రాలు, విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకుంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టీ-సిరీస్ నిర్మిస్తున్న ‘స్పిరిట్’, హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ‘కల్కి 2’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ రూపొందించనున్న ‘సలార్ 2’ చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు.

వీటిలో ‘ఫౌజీ’ సమ్మర్‌లో విడుదలకు సిద్ధమవుతుండగా, ‘స్పిరిట్’ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘కల్కి 2’ షూటింగ్ కొనసాగుతోంది. మరోవైపు ‘సలార్ 2’ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఒక సాధారణ హీరోగా మొదలైన ప్రభాస్ ప్రయాణం.. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్థాయికి చేరుకుంది. 24 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విజయాలు, రికార్డులు సొంతం చేసుకున్న ఆయన.. రాబోయే చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. అభిమానులు కూడా ప్రభాస్ తదుపరి సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts