
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఆగస్టు 21న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ.. ‘అమీర్ లోగ్’ సినిమాను ఇప్పటికే చాలాసార్లు చూశామని, ఇది కచ్చితంగా హిట్ అయ్యే చిత్రం అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదని, తాను చేసిన ఈ ప్రయత్నం ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు.
‘‘ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే మేం హిట్ కొట్టేశాం, మేం అనుకున్నది సాధించేశాం అని అర్థమైంది. మలయాళంలో తీసినట్టుగా మన దగ్గర సినిమాలు రావడం లేదని అంటుంటారు. ఇకపై హైదరాబాద్ ఎరా స్టార్ట్ అయింది. ఆగస్టు 21న నైజాంలో స్టార్ట్ అయ్యే సౌండ్ అన్ని వుడ్‌లకు చేరుకుంటుంది’’ అని రమణా రెడ్డి అన్నారు.
నిర్మాత మాధవి రెడ్డి సోమ మాట్లాడుతూ.. తనను ముందుండి నడిపిస్తున్న భర్త రమణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైటర్, డైరెక్టర్, నిర్మాతగా ఆయన అన్ని బాధ్యతలను చూసుకున్నారని, ‘అమీర్ లోగ్’ను అందమైన పెయింటింగ్‌లా తీర్చిదిద్దారని అన్నారు. సినిమా చూసి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఏదో ఒక భావోద్వేగాన్ని తమతో పాటు ఇంటికి తీసుకెళ్తారని పేర్కొన్నారు.
నటుడు MC హరి మాట్లాడుతూ.. ‘అమీర్ లోగ్’ తనకు మంచి అవకాశం, కుటుంబం, అనుభవాన్ని అందించిందన్నారు. ప్రీమియర్లు ప్రదర్శించిన ప్రతి చోటా అద్భుతమైన స్పందన వచ్చిందని, ఆగస్టు 21న కూడా అదే ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
నటుడు మనోజ్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలోనే ‘అమీర్ లోగ్’ లాంటి సినిమా రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన వస్తోందని, స్మరణ్ సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిందని తెలిపారు. తెలంగాణను ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు.
నటి వేదా జలంధర్ మాట్లాడుతూ.. ప్రీమియర్లకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. సినిమాలో నిజాయితీ, అమాయకత్వంతో పాటు అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని అన్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ తిన్నంత సంతృప్తి కలుగుతుందని పేర్కొన్నారు.
ఎడిటర్ రోహిత్ మాట్లాడుతూ.. దర్శకుడు రమణ రెడ్డితో తనకు ఏడేళ్లుగా అనుబంధం ఉందన్నారు. ‘అమీర్ లోగ్’ కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని, ఆ కష్టానికి తగిన ఫలితం ఆగస్టు 21న వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కో-ప్రొడ్యూసర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికాలో కూడా ‘అమీర్ లోగ్’ గురించి ప్రేక్షకులు అడుగుతున్నారని తెలిపారు. ఈ సినిమాను రమణ రెడ్డి తన భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లారని ప్రశంసించారు.
నటుడు యోగి మాట్లాడుతూ.. హైదరాబాద్‌పై రమణ రెడ్డికి ఉన్న ప్రేమను ‘అమీర్ లోగ్’ ద్వారా చూపించబోతున్నారని అన్నారు. ఏపీతో పాటు కరీంనగర్, వరంగల్‌లో నిర్వహించిన ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన వచ్చిందని తెలిపారు.
ప్రీమియర్లకు వస్తున్న స్పందనతో మంచి అంచనాలను ఏర్పరుచుకున్న ‘అమీర్ లోగ్’ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
